Ys Jagan Review: కరోనా మహమ్మారి ఉధృతి ఏపీలో తగ్గుముఖం పడుతోంది. కరోనా నియంత్రణ చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి సమీక్షించారు. వ్యాక్సినేషన్‌పై సూచనలు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోవిడ్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించింది. కోవిడ్ నివారణ చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష(Ys jagan Review) నిర్వహించి ప్రత్యేక సూచనలు జారీ చేశారు. కరోనా వ్యాక్సినేషన్‌కు సంబంధించిన ప్రత్యేక ఆదేశాలిచ్చారు. టీచర్లు, స్కూళ్లలో పనిచేసే సిబ్బందికి వ్యాక్సినేషన్‌లో ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని వ్యాక్సినేషన్ నిర్వహించాలన్నారు.ఇలా చేస్తే వ్యాక్సినేషన్ (Corona Vaccination)ప్రక్రియ క్రమబద్ధంగా, ప్రాధాన్యత పరంగా ఉంటుందన్నారు. 18 నుంచి 44 ఏళ్లలోపు వారికి వ్యాక్సినేషన్ ఇవ్వాల్సి ఉన్నందున..ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని వైఎస్ జగన్ చెప్పారు. ప్రజలతో ఎక్కువగా సంబంధాలు కలిగి ఉండేవారు, ఉద్యోగులు, సిబ్బందికి అధిక ప్రాధాన్యత ఇచ్చే దిశగా ఆలోచన చేయాలన్నారు.
మరోవైపు డిజిటల్ హెల్త్‌పై సమీక్షించిన వైఎస్ జగన్..ఆరోగ్యశ్రీ కార్డులో కుటుంబసభ్యుల ఆరోగ్య వివరాలు క్యూఆర్ కోడ్ రూపంలో అందుబాటులో ఉండాలని సూచించారు. విలేజ్ క్లినిక్స్‌లో కూడా డేటా వివరాల నమోదుతో పాటు ప్రతి గ్రామం, వార్డు క్లినిక్స్‌లో సైతం కంప్యూటర్ ఉండాలన్నారు. ఆరోగ్యశ్రీ లేదా ఆధార్ నెంబర్ చెబితే వెంటనే ఆరోగ్య వివరాలు వచ్చేవిధానం ఉండాలని జగన్ అదేశించారు. టీచింగ్ ఆసుపత్రుల్లో రిక్రూట్‌మెంట్‌పై దృష్టి సారించి..మూడు నెలల్లోగా సిబ్బంది భర్తీ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు.
Also read: ఆర్టికల్ 370 రద్దుతో జమ్ముకశ్మీర్‌లో పరిణామాలు ఎంత వరకూ మారాయి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook