AP CM YS Jagan Inaugurates Kurnool Airport At Orvakal: ఏపీ ప్రభుత్వం అద్భుతం చేసింది. దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం సొంత ఖర్చులతో నిర్మించిన ఎయిర్పోర్ట్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్‌పోర్టును ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం ప్రారంభించారు. అనంతరం కర్నూలు ఎయిర్‌పోర్టును జాతికి అంకితం చేశారు.
కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్సింగ్, పలువురు నేతలు, ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అంతకుముందు మధ్యాహ్నం 12 గంటల సమయానికి సీఎం వైఎస్ జగన్ కర్నూలు ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని వైఎస్ జగన్(YS Jagan Mohan Reddy) ఆవిష్కరించారు. దాదాపు రూ.153 కోట్ల వ్యయంతో ఏపీ ప్రభుత్వం కర్నూలు సమీపంలోని ఓర్వకల్లు వద్ద విమానాశ్రయాన్ని నిర్మించింది.
Also Read: Gold Price Today In Hyderabad: బులియన్ మార్కెట్లో స్థిరంగా బంగారం ధరలు, పతనమైన వెండి ధరలు
మార్చి 28 నుంచి మూడు నగరాలు విశాఖ, చెన్నై, బెంగళూరుకు విమాన సేవలు ప్రారంభం కానున్నాయి. ఉడాన్ విమాన సర్వీసులు కర్నూలు(Kurnool) ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. విమాన సర్వీసులు ప్రాంభించడానికి ఈ ఏడాది జనవరి 15న డీజీసీఏ లైసెన్స్ జారీ చేసింది. జనవరి 27న సెక్యూరిటీ క్లియరెన్స్ సైతం మంజూరైంది. జనవరి 18, 2019న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) ఎయిర్పోర్ట్ పనులను ప్రారంభించారు. ప్రస్తుత ప్రభుత్వం పనులను పూర్తి చేయడంతో పాటు అనుమతులు తీసుకొచ్చి విమాన సర్వీసులను ప్రారంభిస్తోంది.
Also Read: 7th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు స్పెషల్ ఫెస్టివల్ అడ్వాన్స్, LTC, మార్చి 31 తుది గడువు
మొత్తం 2,000 మీటర్ల పొడవుగ, 30 మీటర్ల వెడల్పులో ఇక్కడి రన్‌వేను అభివృద్ధి చేశారు. ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, అడ్మిన్ బిల్డింగ్, పోలీస్ బ్యారక్, ప్యాసింజర్ లాంజ్, వీఐపీ లాంజ్, ప్రత్యేక విద్యుత్ సబ్ స్టేషన్, నాలుగు విమానాలకు పార్కింగ్ సహా అన్ని మౌలిక వసతులను కల్పించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook