AP New Medical Colleges: ఏపీలో కొత్తగా 12 మెడికల్ కళాశాలలు, ఎక్కడెక్కడంటే

AP New Medical Colleges: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మెడికల్ కళాశాలల ఏర్పాటు చర్యలు వేగవంతమవుతున్నాయి. వైద్య కళాశాలల అనుమతి విషయమై..ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రికి లేఖ అందించారు..

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 1, 2022, 03:25 PM IST
  • ఏపీలో జిల్లాకో వైద్య కళాశాల ఏర్పాటుపై ప్రభుత్వ సన్నాహాలు
  • కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవియాను కలిసిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్
  • రాష్ట్రంలో మిగిలిన 12 జిల్లాల మెడికల్ కళాశాలలకు అనుమతులివ్వాల్సిందిగా విజ్ఞప్తి
AP New Medical Colleges: ఏపీలో కొత్తగా 12 మెడికల్ కళాశాలలు, ఎక్కడెక్కడంటే

AP New Medical Colleges: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మెడికల్ కళాశాలల ఏర్పాటు చర్యలు వేగవంతమవుతున్నాయి. వైద్య కళాశాలల అనుమతి విషయమై..ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రికి లేఖ అందించారు..

ఏపీలో జిల్లాకొక మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తామని గతంలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించారు. ఇందులో భాగంగా ఇప్పటికే మూడు కొత్త మెడికల్ కళాశాలలకు కేంద్రం అనుమతిచ్చింది. ఇంకా 12 మెడికల్ కళాశాలలకు అనుమతి రావల్సి ఉంది. ఈ విషయమై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవియాను కలుసుకున్నారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధాన న్యాయమూర్తుల సమావేశం అనంతంర కేంద్రమంత్రితో వైఎస్ జగన్ భేటీ అయ్యారు.

రాష్ట్రంలో వైద్య కళాశాలల అవసరం, అనుమతుల విషయమై చర్చించారు. విభజన అనంతరం ఏపీలో అత్యాధునిక వైద్య సదుపాయాల కొరత ఏర్పడి..హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలకు వెళ్లాల్సి వస్తోందని ముఖ్యమంత్రి వివరించారు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం ప్రజారోగ్య వ్యవస్థను మెరుగుపర్చేందుకు చేస్తున్న ప్రయత్నాల్ని కేంద్రమంత్రికి వివరించారు. ముఖ్యంగా పీహెచ్‌సీ, యూపీహెచ్‌సీ, సీహెచ్‌సీ, ఏహెచ్, డీహెచ్‌లు, ప్రాథమిక, ద్వితీయ స్థాయి ఆసుపత్రుల్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. 

ప్రతి జిల్లాకొక వైద్య కళాశాల ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అత్యాధునిక వైద్యం అందించడం సులభమౌతుందన్నారు. ఏపీలో కొత్తగా 13 జిల్లాల ఏర్పాటుతో మొత్తం 26 జిల్లాలయ్యాయన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 11 మెడికల్ కళాశాలలున్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా పాడేరు, మచిలీపట్నం, పిడుగురాళ్లలో కొత్త మెడికల్ కళాశాలలకు అనుమతిచ్చింది. ఇంకా 12 జిల్లాల్లో మెడికల్ కళాశాలల ఏర్పాటుకు అనుమతివ్వాల్సి ఉంది. మిగిలిన 12 మెడికల్ కళాశాలల ఏర్పాటుకు అనుమతివ్వాలని కోరారు.

రాష్ట్రంలో అనుమతి రావల్సిన కళాశాలలు

విజయనగరం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రి, పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు, బాపట్ల, చిత్తూరు, అన్నమయ్య జిల్లా, సత్యసాయి జిల్లా, నంద్యాల జిల్లాల్లో మెడికల్ కళాశాలలకు అనుతి రావల్సి ఉంది. 2023 డిసెంబర్ నాటికి కళాశాలల నిర్మాణాల్ని పూర్తి చేసి 2024 అడ్మిషన్లకు సిద్ధం చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వివరించారు.

Also read: YCP Leader Murdered: ఏలూరు జిల్లాలో వైసీపీ నాయకుడి దారుణ హత్య..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News