Skoch cm of the year award: సీఎం ఆఫ్ ఇది ఇయర్ అవార్డు వైఎస్ జగన్‌కే

Skoch cm of the year award: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు మరో అరుదైన గౌరవం లభించింది. పేదలకు అండగా నిలిచే సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నందుకు సీఎం ఆఫ్ ది ఇయర్  అవార్డుతో స్కాచ్ గ్రూప్ సత్కరించింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్ని అధ్యయనం చేసి ఈ అవార్డు ఎంపిక చేస్తారు.

Last Updated : Feb 16, 2021, 08:22 PM IST
  • ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు అరుదైన గౌరవం
  • సీఎం ఆఫ్ ది ఇయర్ అవార్డుతో సత్కరించిన స్కాచ్ గ్రూప్
  • సంక్షేమ పథకాలతో ప్రజలకు చేరువ కావడం, ఉత్తమ పాలనకు లభించిన సత్కారం
Skoch cm of the year award: సీఎం ఆఫ్ ఇది ఇయర్ అవార్డు వైఎస్  జగన్‌కే

Skoch cm of the year award: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు మరో అరుదైన గౌరవం లభించింది. పేదలకు అండగా నిలిచే సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నందుకు సీఎం ఆఫ్ ది ఇయర్  అవార్డుతో స్కాచ్ గ్రూప్ సత్కరించింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్ని అధ్యయనం చేసి ఈ అవార్డు ఎంపిక చేస్తారు.

ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వం ( Ys jagan government )అధికారంలో వచ్చి రెండేళ్లవుతోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు వైఎస్ జగన్. ఆరోగ్య శ్రీ,, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్‌ చేయూత వంటి పథకాలతో పేదలకు అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ ( Ap cm ys jagan )‌ని  ప్రఖ్యాత స్కాచ్‌ గ్రూపు  సీఎం ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు ( Cm of of year award ) తో సత్కరించింది. స్కాచ్ గ్రూప్ ఛైర్మన్ సమీర్ కొచ్చర్ స్వయంగా ముఖ్యమంత్రి జగన్‌ను కలిసి ఈ అవార్డు అందించారు. పాలనలో ఉత్తమ ప్రతిభ కనబర్చిందుకు ఈ అవార్డు ఇస్తున్నట్టు తెలిపారు.  

దేశ వ్యాప్తంగా ఏడాది పాటు వివిధ రాష్ట్రాలలో ప్రాజెక్ట్ స్థాయి ఫలితాల అధ్యయనం ఆధారంగా ఈ అవార్డుకు ముఖ్యమంత్రుల్ని ఎంపిక చేస్తుంటారు. ముఖ్యంగా రాష్ట్రంలో అమలవుతున్న వైఎస్‌ఆర్‌ రైతు భరోసా ( Ysr rythu bharosa ) కేంద్రం పథకం ద్వారా  ప్రకటించిన కనీస మద్దతు ధరకే రైతులు పండించిన పంటను కొనుగోలు చేస్తున్నారు. ఈ పథకం ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతోందని స్కాచ్ గ్రూప్ ( Skoch group ) గుర్తించింది. అటు వైఎస్‌ఆర్ చేయుతా ( Ysr cheyutha )పథకం ద్వారా  మధ్య వయస్కులైన మహిళలకు నగదు ఇవ్వడం ద్వారా మహిళల సాధికారతకు సహకారం లభిస్తోంది. అదే విధంగా మహిళల భద్రత, రక్షణ కొరకు తీసుకొచ్చిన దిశ ( Disha ), అభయ్‌ వంటి పథకాలు శాంతిభద్రతలు రక్షణకు తోడ్పడుతున్నాయని స్కాచ్ గ్రూప్ అభిప్రాయపడింది.

అన్నింటికి మించి కరోనా కాలంలో ప్రజలను ఆదుకోవడంలో ప్రభుత్వం చూపిన చొరవను ప్రత్యేకంగా ప్రశంసించాల్సిందేనని స్కాచ్ గ్రూప్ చైర్మన్ సమీర్ కొచ్చర్ తెలిపారు. కోవిడ్ సమయంలో కూడా ప్రభుత్వం  రాష్ట్రవ్యాప్తంగా 123 ప్రాజెక్టులను అమలు చేసిందని చెప్పారు. పాలనను మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా మార్చడానికి గత రెండేళ్లలో రాష్ట్రం ప్రభుత్వం అనేక విప్లవాత్మక చర్యలు తీసుకుందని..దీనికి సంబంధించి పూర్తి క్రెడిట్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కే దక్కుతుందని..అందుకే సీఎం ఆఫ్ ది ఇయర్ అవార్డు ( Cm year of the award )ను ఇస్తున్నామని స్పష్టం చేశారు. 

Also read: Ys jagan visakha tour: ఆసక్తి రేపుతున్న సీఎం జగన్ విశాఖ పర్యటన, స్టీల్‌ప్లాంట్ ఉద్యోగుల జేఏసీని కలవనున్న జగన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News