CM Jagan Comments: ఆంధ్రప్రదేశ్ లో స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం పరేడ్ ప్రదర్శనను తిలకించారు. వివిధప్రభుత్వ పథకాలతో రూపొందించిన వివిధ శకటాలను ప్రదర్శించారు. అనంతరం ఏపీ ప్రజలను ఉద్దేశించి స్వాతంత్ర్య దినోత్సవ సందేశం ఇచ్చారు సీఎం జగన్. ఎన్నికల హామీలు, మీడియా తీరుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీఎం జగన్.ఎన్నికల హామీలను కొన్ని పార్టీలు ఆపహ్యాం చేశాయన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం ద్వారా కొన్ని పార్టీలు ప్రజలను మోసం చేశాయన్నారు ఏపీ సీఎం జగన్.
ఎక్కడ సభ జరిగినా మీడియా ప్రస్తావన లేకుండా మాట్లాడరు సీఎం జగన్. ఇండిపెండెన్స్ వేడుకల ప్రసంగంలోనూ మీడియాపై కీలక వ్యాఖ్యలు చేశారు. స్వతంత్రంగా ఉండాల్సిన మీడియా కొందరికి భజన చేస్తుందని స్వాతంత్ర్య సమరయోధులు ఎన్నడైనా ఊహించారా? అని సీఎం జగన్ ప్రశ్నించారు. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా జిల్లాల విభజన చేపట్టామన్నారు. గతంలో 13 జిల్లాలు ఉండగా.. వాటిని 26కు పెంచామన్నారు. గత మూడేళ్లలో 95 శాతం హామీలను అమలు చేశామన్నారు జగన్. ఏపీలో అనేక సంస్కరణలను తీసుకొచ్చామని చెప్పారు. అర్హులందిరికి ప్రతి నెలా ఒకటో తారీఖునే పెన్షన్లను వాళ్ల ఇంటి దగ్గరే అందిస్తున్నామని తెలిపారు.
ఏపీలో అమలవుతున్న వాలంటీర్ల వ్యవస్థ చరిత్రాత్మకమన్నారు సీఎం జగన్. పౌర సేవల్లో కీలక మార్పులు చేశామన్నారు. విత్తనం నుంచి విక్రయించే వరకు అన్నదాతకు అండగా ఉంటున్నామన్నారు. రైతు సంక్షేమానికి 1.27 లక్షల కోట్లు ఖర్చు చేశామన్నారు.నాడు నేడుతో ప్రభుత్వ స్కూళ్లను దశ మార్చామన్నారు. ఇంగ్లీష్ మీడియంను పేదలకు అందిస్తున్నామని వెల్లడించారు. వైద్య రంగంలోనూ ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని, మూడేళ్లలో విద్యారంగంపై 53 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు జగన్. లక్షలాది మంది ఇళ్ల పట్టాలు ఇచ్చామని.. ఇళ్ల నిర్మాణాలు చేపట్టామని తెలిపారు. మూడేళ్లలోనే రికార్డ్ స్థాయిలో లక్షా 84 వేల శాశ్వత ఉద్యోగాలను కల్పించామని జగన్ తెలిపారు. ఇరవై వేల కాంట్రాక్టు ఉద్యోగాలు, 4 లక్షల అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇచ్చామన్నారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చేశామన్నారు.
ఏపీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా సామాజిక న్యాయాన్ని అమలు చేశామన్నారు జగన్మోహన్ రెడ్డి. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని విధాలుగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సమానన అవకాశాలు కల్పించామన్నారు. 13 జిల్లా పరిషత్ లో ఛైర్మన్ పదవుల్లో 9 పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీలకే ఇచ్చామన్నారు. స్థానిక సంస్థల్లో మహిళలకు యాభై 50 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత తమకే దక్కిందన్నారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.
Read Also: Tirumala: భక్తులకు 40 గంటలు.. మంత్రి అనుచరులకు నిమిషాల్లో దర్శనం! తిరుమలలో వైసీపీ నేతల దౌర్జన్యం
Read Also: Independence Day 2022: స్వాతంత్ర్య పోరాటానికి సంబంధించిన ఈ క్విజ్‌లో మీ స్కోర్ ఎంత..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook