Jagan Kuppam Tour: చంద్రబాబు కోటపై సీఎం జగన్ ఫోకస్.. కుప్పం లీడర్లతో మీటింగ్

Jagan Kuppam Tour: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పార్టీలు దూకుడు పెంచాయి. అధికార, విపక్షాలు జోరుగా జనంలోకి వెళుతున్నాయి. వచ్చే ఎన్నికలే టార్గెట్ గా సీఎం జగన్ ఆపరేషన్ ప్రారంభించారు. వచ్చే ఎన్నికల్లో మొత్తం 175 సీట్లే సాధించడమే టార్గెట్ గా పని చేయాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు జగన్. కుప్పంలోనూ గెలవబోతున్నామని చెబుతూ వస్తున్నారు

Written by - Srisailam | Last Updated : Aug 4, 2022, 11:50 AM IST
  • కుప్పంపై సీఎం జగన్ ఫోకస్
  • కుప్పం నేతలతో మీటింగ్
  • వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్లాన్
Jagan Kuppam Tour: చంద్రబాబు కోటపై సీఎం జగన్ ఫోకస్.. కుప్పం లీడర్లతో మీటింగ్

Jagan Kuppam Tour: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పార్టీలు దూకుడు పెంచాయి. అధికార, విపక్షాలు జోరుగా జనంలోకి వెళుతున్నాయి. వచ్చే ఎన్నికలే టార్గెట్ గా సీఎం జగన్ ఆపరేషన్ ప్రారంభించారు. వచ్చే ఎన్నికల్లో మొత్తం 175 సీట్లే సాధించడమే టార్గెట్ గా పని చేయాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు జగన్. కుప్పంలోనూ గెలవబోతున్నామని చెబుతూ వస్తున్నారు. చెప్పడమే కాదు కార్యచరణ కూడా మొదలుపెట్టారు. జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేస్తున్నారు జగన్.. పార్టీ నేతలు, కార్యకర్తలతో నేరుగా సమావేశం కాబోతున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా సీఎం జగన్ తమ కొత్త మిషన్ ను ప్రతిపక్ష నేత చంద్రబాబు కుప్పం నియోజకవర్గం నుంచే మొదలు పెడుతున్నారు.

గురువారం చిత్తూరు జిల్లా కుప్పం అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ కార్యకర్తలతో సమావేశం కానున్నారు సీఎం జగన్. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో జరగనున్న సమావేశానికి కుప్పం నియోజకవర్గ వైసీపీ నేతలంతా వస్తున్నారు. కుప్పంలో పార్టీ పరిస్థితి,  క్షేత్రస్థాయిలో ఎంత బలంగా ఉన్నామనే అంశాలపై జగన్ ఆరా తీయనున్నారు. సంక్షేమ పథకాల అమలు తీరును తెలుసుకోనున్నారు. వచ్చే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబును ఓడించాలనే కసితో ఉన్న సీఎం జగన్.. పార్టీ నేతలకు భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేస్తారని తెలుస్తోంది. నియోజకవర్గంలో పట్టున్న టీడీపీ నేతలను ఆకర్షించడానికి వైసీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు.

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచే కుప్పం నియోజకవర్గంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు సీఎం జగన్. సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డకి కుప్పం బాధ్యతలు అప్పగించారు. జగన్ ఆదేశాలతో కుప్పం నియోజకవర్గంపై వర్క్ చేస్తున్నారు పెద్దిరెడ్డి. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కుప్పం నియోజకవర్గంలో వైసీపీకి ఊహించని ఫలితాలు వచ్చాయి. నియోజకవర్గంలో దాదాపు 70 శాతం సీట్లు వైసీపీ గెలుచుకుంది. తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి కంచుకోటగా ఉన్న కుప్పం మున్సిపాలిటీపై వైసీపీ జెండా ఎగిరింది. ఇప్పుడు సీఎం జగన్ నేరుగా జగన్ రంగంలోకి దిగనుండటంతో కుప్పంలో సమీకరణాలు మారతాయని చిత్తూరు జిల్లా వైసీపీ నేతలంటున్నారు.

Read also: MP Gorantla Madhav: వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ రాసలీలలు.. సోషల్ మీడియాలో వీడియో వైరల్  

Read also: MP Gorantla Madhav: గతంలో రేప్ కేస్.. ఇప్పుడు న్యూడ్ కాల్! వివాదాలకు కేరాఫ్ గోరంట్ల మాధవ్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News