వైసీపీ,టీడీపీలకు సమాన దూరం పాటిస్తానంటూ పవన్ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందించార. విశాఖ జిల్లా నర్సీపట్నం ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ జగన్ కు ..తనకు సమాన దూరం పాటిస్తామని పవన్ ఎలా అంటారని ప్రశ్నించారు.
నేర చరిత్ర ఉన్న జగన్‌కు, తనకూ పోలికా? అని మండిపడ్డారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని జగన్ లక్షల కోట్లు దోచుకున్నారని... తాను అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అవినీతిని నిర్మూలించి.. పాదర్శక పాలనను అందిస్తున్నానని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాజకీయాలు చేసుకుంటే తప్పులేదు కానీ... తన కష్టాన్ని తక్కువగా అంచనా వేసి మాట్లాడటం బాధాకరమని చంద్రబాబు పేర్కొన్నారు.
జనసేన చీప్ పవన్ కల్యాణ్ ఓ ప్రముఖ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ, వైసీపీ దొందు దొందేనని ..రెండు అవినీతి పార్టీలేనని విమర్శించారు. జగన్, చంద్రబాబులకు సమాన దూరం పాటించమే జనసేన విధానానమి పవన్ వ్యాఖ్యానించారు. పవన్ వ్యాఖ్యాలపై ఏపీ సీఎం చంద్రబాబు ఈ మేరకు స్పందించారు