AP Fibernet Scam: చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన ఏపీ ఫైబర్‌నెట్ కుంభకోణం కేసులో చంద్రబాబును ఏ1గా, వేమూరి హరికృష్ణను ఏ2గా, కోగంటి సాంబశివరావును ఏ2గా చేరుస్తూ సీఐడీ పోలీసులు ఏసీబీ కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేశారు. 2 వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులో తొలిదశలో 333 కోట్ల అక్రమాలు జరిగాయనేది సీఐడీ అభియోగం.
ఏపీ ఫైబర్‌నెట్ కేసులో చంద్రబాబు హయాంలో నిబంధనలకు విరుద్ధంగా లోకేశ్‌కు సన్నిహితుడైన వేమూరి హరికృష్ణకు చెందిన టెరా సాఫ్ట్ కంపెనీకు టెండర్లు అప్పగించారని సీఐడీ దర్యాప్తులో తేలింది. ఈ కేసులో చంద్రబాబును ఏ1గా, నెట్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ వి హరికృష్ణ ప్రసాద్ ఏ2గా, ఐఆర్‌టీఎస్ అదికారి కే సాంబశివరావును ఏ3గా చేర్చింది. టెండర్ కేటాయించినప్పటి నుంచి ప్రాజెక్టు పూర్తయ్యేవరకూ చాలా అవకతవకలు జరిగి రాష్ట్ర ఖజానాకు భారీ నష్టం వాటిల్లిందని సీఐడీ ఆరోపించింది. వస్తు ధరలు లేదా అనుసరించాల్సిన ప్రమాణాల కోసం మార్కెట్ సర్వే చేయకపోయినా చంద్రబాబు ఆ ప్రాజెక్టు అంచనాను ఆమోదించారని సీఐడీ తెలిపింది.
అంతకంటే ముందు టెండర్ల మూల్యాంకన కమిటీలో హరికృష్ణ ప్రసాద్ పేరు చేర్చడం, టెరా సాఫ్ట్ కంపెనీని బ్లాక్‌లిస్ట్ నుంచి తప్పించడం, అదే కంపెనీకు టెండర్ అప్పగించాలని ఒత్తిడి చేయడం ఇతర ఆరోపణలుగా ఉన్నాయి. ఈ కేసులో నిందితులపై సీఐడీ ఐపీసీ సెక్షన్లు 166, 167, 418, 465, 468, 471, 409, 506 రెడ్ విత్ 120 బి కింద కేసులు నమోదయ్యాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook