AP Budget Highlights: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ వెలువడింది. రాష్ట్ర ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వార్షిక బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. సంక్షేమం, మహిళా సాధికారతకు బడ్జెట్లో పెద్దపీట వేశారు.
ఏపీ వార్షిక బడ్జెట్ (Ap Budget) కోసం ఒకరోజు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం ఏర్పాటైంది. అసెంబ్లీ కంటే ముందుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (Ap cm ys jagan) అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ బడ్జెట్‌ను ఆమోదించింది. అనంతరం ఉదయం 11 గంటలకు రాష్ట్ర అసెంబ్లీలో ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ( Buggana Rajendranath reddy) 2021-22 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 2 లక్షల 29 వేల 779 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను రూపొందించారు. ఈ బడ్దెట్‌లో సంక్షేమానికి పెద్ద పీట వేశారు. వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి కన్నబాబు ( Kannababu) ప్రవేశపెట్టారు. సభ ప్రారంభంలో మాజీ ఎమ్మెల్యేల మృతిపై అసెంబ్లీ సంతాపం తెలిపింది.
బీసీ ఉప ప్రణాళిక కోసం 28 వేల 237 కోట్లు, ఎస్సీ ఉప ప్రణాళిక కోసం 17 వేల 403 కోట్లు, ఎస్టీ ఉప ప్రణాళిక కోసం 6 వేల 131 కోట్లు, కాపు సంక్షేమం కోసం 3 వేల 306 కోట్లు, ఈబీసీ సంక్షేమం కోసం 5 వేల 478 కోట్లను బడ్జెట్లో కేటాయించారు. మైనార్టీ యాక్షన్ ప్లాన్ కోసం 1756 కోట్లు, చిన్నారుల కోసం 16 వేల 748 కోట్ల రూపాయల్ని కేటాయంచారు. విద్యారంగంలో పథకాలకు 24 వేల 624 కోట్లు కేటాయించగా..వైద్య, ఆరోగ్య రంగాలకు 13 వేల 830 కోట్లు కేటాయించారు.వైఎస్సార్ పింఛన్ కానుక పథకానికి 17 వేల కోట్లు కేటాయించారు. అమ్మ ఒడి పథకం ( Amma vodi scheme) కోసం 6 వేల 107 కోట్లు కేటాయించగా..రైతులకు సున్నవడ్డీ చెల్లింపుల కోసం 5 వందల కోట్లు కేటాయించారు. జగనన్న విద్యా దీవెనకు 2 వేల 5 వందల కోట్లు, జగనన్న వసతి దీవెనకు 2 వేల 223 కోట్లు కేటాయింపులు జరిగాయి.
Also read; AP Budget Session: కోవిడ్ నియంత్రణలో ఏపీ దేశానికే ఆదర్శం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook