అసెంబ్లీలో 2019-20 సంవత్సరానికి సంబంధించిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ఏపీ సర్కార్ ప్రవేశపెట్టింది. బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఆర్ధిక మంత్రి యనమల..సుదీర్ఘంగా వివరణ ఇచ్చారు. నాలుగున్నరేళ్ల ప్రయాణంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నామని..హేతుబద్ధత లేకుండా రాష్ట్ర విభజన జరిగిందని విమర్శించారు. దాని వల్ల రాజధాని నగరాన్ని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదాయ-వ్యయాలు, ఆస్తులు, అప్పులు సరిగా పంపిణీ చేయలేదన్నారు.
ముఖ్యాంశాలు:
మొత్తం బడ్జెట్: 2,26,117.53కోట్లు
రెవెన్యూ వ్యయం రూ.1,80,369.33 కోట్లు
మూలధన వ్యయం రూ.29,596.33కోట్లు
రెవెన్యూ మిగులు రూ.2099.47కోట్లు
ఆర్థికలోటు 32,390.68కోట్లు
శాఖల వారీగా కేటాయింపులు :
* ఆర్థికశాఖకు రూ.51 వేల 841.69కోట్లు
* హోంశాఖకు రూ.6 వేల 397.94కోట్లు
* జలవనరులశాఖకు రూ.16 వేల 852.27 కోట్లు
* సాధారణ పరిపాలన రూ.1,177.56కోట్లు
* ప్రభుత్వ రంగ సంస్థలకు రూ.2.56కోట్లు
* ప్రణాళిక విభాగానికి రూ.1,403.17కోట్లు
* న్యాయశాఖకు రూ.918.కోట్లు
* శాసనసభ వ్యవహారాల శాఖకు రూ.149.90 కోట్లు
* పట్టణాభివృద్ధికి శాఖకు రూ.7 వేల 979.34కోట్లు
* గ్రామీణాభివృద్ధికి రూ.35 వేల 182.61కోట్లు
* రెవెన్యూశాఖకు రూ.5 వేల 546.94 కోట్లు
* విద్యుత్, మౌలిక వనరులకు రూ.5 వేల 473.83 కోట్లు
* పౌరసరఫరాలశాఖకు రూ.3 వేల 763.42కోట్లు
* పరిశ్రమలు, వాణిజ్యం రూ.4 వేల 114.92 కోట్లు
* ఐటీ, కమ్యూనికేషన్స్‌కు రూ.1006.81 కోట్లు
* చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు రూ.400 కోట్లు
* అటవీ పర్యావరణ, శాస్త్ర సాంకేతిక విభాగానికి రూ.491.93 కోట్లు
* కార్మిక ఉపాధి కల్పన కోసం రూ.1,225.75 కోట్లు
* వ్యవసాయ మార్కెటింగ్, కో-ఆపరేటివ్‌కు రూ.12వేల 732.97 కోట్లు
* ‘అన్నదాత సుఖీభవ’ ఈ పథకానికి రూ.5 వేల కోట్లు
* ఆహార శుద్ధి పరిశ్రమలకు రూ.300 కోట్లు.
* మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ రూ.1000 కోట్లు
* పశుగ్రాసం అభివృద్ధికి రూ.200 కోట్లు.
* పశువులపై బీమా కోసం రూ.200 కోట్లు
* పాడి పశు సంవర్ధక, మత్స్యశాఖకు రూ.2 వేల 30.87 కోట్లు
* వైద్యం, ఆరోగ్య, కుటుంబ సంక్షేమం రూ.10 వేల 032.15 కోట్లు
* గృహ నిర్మాణానికి రూ.4,079.10 కోట్లు
* ఇళ్ల స్థలాల సేకరణ కోసం రూ.500 కోట్లు
* డ్రైవర్స్ సాధికార సంస్థకు రూ.150 కోట్లు
* ఉన్నత విద్యాశాఖకు రూ.3,171.63కోట్లు
* సెకండరీ విద్యాశాఖకు రూ.3,171.63కోట్లు
* వెనుకబడిన తరగతుల సంక్షేమానికి రూ.8,242.64కోట్లు
* వెనుకబడిన వర్గాల కార్పొరేషన్లకు రూ.3 వేల కోట్లు
* బ్రాహ్మణ కార్పొరేషన్‌కు రూ.100 కోట్లు
* క్షత్రియుల సంక్షేమం కోసం రూ.50కోట్లు
* మైనార్టీ సంక్షేమానికి రూ.1,308.73కోట్లు