ఏపీ బడ్జెట్‌ 2019-20: అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల వారీగా కేటాయింపుల వివరాలు

ఏపీ బడ్జెట్‌ 2019: కేటాయింపుల వివరాలు

Last Updated : Jul 13, 2019, 01:05 AM IST
ఏపీ బడ్జెట్‌ 2019-20: అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల వారీగా కేటాయింపుల వివరాలు

అమరావతి: ఏపీ అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రూ.2,27,974 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా రూ.1,778.52 కోట్లు రెవిన్యూ లోటు ఉన్నట్టు మంత్రి బుగ్గన తెలిపారు. ఈ వార్షిక సంవత్సరానికిగాను బడ్జెట్ అంచనా-19.32శాతం పెరుగుదల కాగా రెవిన్యూ వ్యయం-20.10 శాతం పెరుగుతందని అంచనా వేస్తున్నట్టు మంత్రి పేర్కొన్నారు. ఏపీ బడ్జెట్‌లో వివిధ రంగాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల వారీగా జరిగిన కేటాయింపుల వివరాలు ఇలా ఉన్నాయి.

సాధారణ సర్వీసులకు రూ.66,324 కోట్లు
వ్యవసాయ మార్కెటింగ్, సహకారశాఖలకు రూ.18,327 కోట్లు
పశుసంవర్ధక, డెయిరీ డెవలప్‌మెంట్‌, మత్య్సశాఖలకు రూ.1,912 కోట్లు
బీసీ సంక్షేమానికి రూ.7,271 కోట్లు
హోంశాఖ రూ. 7,461.92 కోట్లు
మైనార్టీ సంక్షేమానికి రూ. 952 కోట్లు
పర్యావరణం, అడవులు, శాస్త్ర సాంకేతిక రంగాలకు రూ.446 కోట్లు
ఉన్నత విద్యకు రూ.3,021 కోట్లు

Also read : కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ, ఏపీకి దక్కిన కేటాయింపులు ఇవేనా ?

ఏపీ రాజధాని నిర్మాణానికి రూ.500 కోట్లు
సాగునీటి పారుదల శాఖకు రూ. 13,139 కోట్లు
వైఎస్‌ఆర్‌ రైతు భరోసాకు రూ. 8,750 కోట్లు
అమ్మ ఒడి పథకానికి రూ.6455 కోట్లు
వైఎస్‌ఆర్‌ 9గంటల ఉచిత విద్యుత్‌కు రూ.4,525 కోట్లు
ధరల స్థిరీకరణ నిధికి రూ.3వేల కోట్లు
విపత్తుల నిర్వహణకు రూ.2,002 కోట్లు
ఫసల్‌ బీయా యోజనకు రూ.1163 కోట్లు
అగ్రిగోల్డ్‌ బాధితులకు 1150 కోట్లు
ఆక్వా రైతుల విద్యుత్‌ సబ్సిడీ రూ.475 కోట్లు
వైఎస్‌ బోర్‌‌వెల్‌ పథకానికి రూ.200 కోట్లు
విత్తనాల సరఫరాకు రూ.200 కోట్లు
పాఠశాలల్లో మౌలికవసతులకు రూ.1500 కోట్లు
మధ్యాహ్న భోజనానికి రూ.1077 కోట్లు
వైఎస్‌ఆర్‌ స్కూల్‌ మెయింటనెన్స్‌ గ్రాంట్‌ రూ.160 కోట్లు
ఆరోగ్యశ్రీ రూ.1740 కోట్లు
ఆస్పత్రుల్లో మౌలికవసతులకు రూ.1500 కోట్లు
ఆశావర్కర్ల గౌరవవేతనం 456 కోట్లు
వైఎస్‌ఆర్‌ గృహ వసతికి రూ 5వేల కోట్లు
పట్టణాల్లో ప్రధాని ఆవాస్‌ యోజనకు రూ.1370 కోట్లు
బలహీనవర్గాల ఇళ్లకు రూ.1280 కోట్లు
వైఎస్‌ఆర్‌ అర్భన్‌ హౌసింగ్‌కు వెయ్యి కోట్లు
వైఎస్సార్‌ కళ్యాణ కానుకకు రూ.300 కోట్లు
కాపు కార్పొరేషన్‌కు రూ.2 వేల కోట్లు
వైఎస్సార్‌ బీమాకు రూ. 404 కోట్లు
బియ్యంపై సబ్సిడీకి రూ.3 వేల కోట్లు
గ్రామ వాలంటీర్లకు రూ.720 కోట్లు
మున్సిపల్‌ వార్డు వాలంటీర్లకు రూ.280 కోట్లు
మున్సిపల్‌ వార్డు సెక్రటేరియట్‌కు రూ.180 కోట్లు
ఏపీఐఐసీకి రూ.360 కోట్లు
కడప స్టీల్‌ప్లాంట్‌కు రూ.250 కోట్లు
పారిశ్రామిక ప్రోత్సాహకాలకు రూ.573 కోట్లు
చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధికి రూ.200 కోట్లు
చిన్న తరహా పరిశ్రమల ప్రోత్సాహానికి రూ.200 కోట్లు
ముఖ్యమంత్రి అభివృద్ధి నిధి కింద రూ.500 కోట్లు
ఉపాధిహామీ పథకానికి రూ.500 కోట్లు
పంచాయతీరాజ్‌ రోడ్లకు రూ.300 కోట్లు
విశాఖ- చెన్నై పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి రూ. 200 కోట్లు
ఆర్టీసీకి రూ.వెయ్యి కోట్లు
ఆర్టీసీ ద్వారా ఇస్తోన్న రాయితీలకు రూ.500 కోట్లు
డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు రూ.1,140 కోట్లు
పట్టణాల్లో స్వయం సహాయక బృందాలకు వడ్డీలేని రుణాలు రూ.648 కోట్లు
ఇరిగేషన్‌, వరద ముంపు నివారణకు రూ.13,139 కోట్లు
వ్యవసాయానికి రూ.20,677 కోట్లు
గ్రామీణాభివృద్ధికి రూ.29,329 కోట్లు
విద్యుత్‌- రూ.6,861 కోట్లు, రవాణా- రూ.6,157 కోట్లు
ఇండస్ట్రీ మినరల్స్‌కు రూ.3,986 కోట్లు
జనరల్‌ ఎకో సర్వీసెస్‌ రూ.6,025 కోట్లు
సాధారణ విద్య- రూ. 32,618 కోట్లు
క్రీడలు, యువజన సర్వీసులకు రూ.329 కోట్లు
సాంకేతిక విద్య- రూ. 580 కోట్లు, సాంస్కతికశాఖకు రూ. 77 కోట్లు
వైద్యరంగానికి రూ. 11,399 కోట్లు
నీటి సరఫరా, పారిశుద్ధ్యానికి రూ.2,234 కోట్లు
గృహనిర్మాణశాఖకు రూ.3,617 కోట్లు
అర్బన్‌ డెవలప్‌మెంట్‌కు రూ. 6,587 కోట్లు
సమాచార, పౌరసంబంధాలశాఖకు రూ. 191 కోట్లు
సంక్షేమశాఖలకు రూ.14,142 కోట్లు
కార్మిక, ఉపాధిశాఖలకు రూ.978 కోట్లు
సామాజిక భద్రత, సంక్షేమానికి రూ.2, 707 కోట్లు
వైఎస్‌ఆర్‌ ట్రైబల్‌ మెడికల్‌ కాలేజి- రూ.66 కోట్లు
గురజాల ప్రభుత్వ మెడికల్‌ కాలేజి -66 కోట్లు
విజయనగరం ప్రభుత్వ మెడికల్‌ కాలేజి -66 కోట్లు
శ్రీకాకుళం కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌, సూపర్‌ స్పెషాలిటీ ఆస్పతికి 50 కోట్లు

Trending News