AP 10th Results: రేపే పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల.. నిబంధనలు ఉల్లంఘిస్తే జైలుశిక్ష తప్పదు!

AP 10th results 2022 date and time. శనివారం (జూన్ 4) పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 3, 2022, 07:32 AM IST
  • రేపే పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల
  • నిబంధనలు ఉల్లంఘిస్తే జైలుశిక్ష తప్పదు
  • 3-7 ఏళ్ల వరకు జైలు శిక్ష
AP 10th Results: రేపే పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల.. నిబంధనలు ఉల్లంఘిస్తే జైలుశిక్ష తప్పదు!

AP 10th Results, AP Government plans to release 2022 10th Results on June 4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. శనివారం (జూన్ 4) పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల చేస్తున్నట్లు తెలిపింది. పదో తరగతి పరీక్షలు పూర్తయిన 25 రోజుల్లోనే ఫలితాలను విడుదల చేయబోతున్నట్టు విద్యాశాఖ తెలిపింది. మార్కుల రూపంలో ఫలితాలు వెల్లడిస్తామని స్పష్టం చేసింది. గతంలో పదో పరీక్షల్లో గ్రేడింగ్ విధానంలో ఫలితాలను ప్రకటించేవారు. 2020 నుంచి గ్రేడ్లకు బదులు మార్కులు ఇస్తున్నారు. 

పదో తరగతి ఫలితాల తరువాత రాష్ట్రంలోని విద్యాసంస్థలు ర్యాంకులకు సంబంధించిన ప్రకటనలు ఇవ్వడంపై కూడా జగన్ సర్కార్ కీలక  ఆంక్షలు విధించింది. ర్యాంకులకు సంబంధించిన ఎలాంటి ప్రకటనలు విద్యాసంస్థలు ఇవ్వొద్దని సూచించింది. ఒకవేళ నిబంధనలు ఉల్లంఘిస్తే.. జైలుశిక్ష తప్పదని కూడా హెచ్చరించింది. 3-7 ఏళ్ల వరకు జైలు శిక్షతో పాటు లక్ష రూపాయల వరకు జరిమానా విధిస్తామని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రయోజనాల దృష్ట్యా 83వ నెంబర్ జీవో జారీ చేసింది. 

ఇదివరకు పదో తరగతి పరీక్షల్లో గ్రేడింగ్ విధానంలో ఫలితాలను ప్రకటించేవారు.  2020 నుంచి మాత్రం గ్రేడ్లకు బదులుగా మార్కులు ఇస్తున్నారు. కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థలు విద్యార్థులకు ర్యాంకులను ఆపాదిస్తూ.. తమ సంస్థకే ఉత్తమ ర్యాంకులు, అత్యధిక ర్యాంకులు వచ్చాయింటూ టీవీల్లో ప్రకటనలు ఇస్తున్నాయి. పదేపదే యాడ్స్ వేయడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రభావితం అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 

ఏప్రిల్ 27వ నుంచి మే 9వ తేదీ వరకు ఏపీలో పదో తరగతి పరీక్షలను నిర్వహించారు. అయితే పరీక్షల సమయంలో జరిగిన పేపర్స్ లీక్ ఘటనలు రాష్ట్రంలో సంచలనం సృష్టించాయి. ఈ విషయంపై ప్రభుత్వం కూడా సీరియస్‌గా తీసుకుని పలువురు ఉపాధ్యాయులను అరెస్ట్ చేసింది. మరోవైపు మాజీమంత్రి నారాయణ విద్యాసంస్థల నుంచే ఈ లీకులు జరిగాయని ఆరోపిస్తూ.. ఆయనను అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. 

Also Read: Horoscope Today June 3 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ మూడు రాశుల వారికి అక‌స్మిక ధ‌న‌ లాభం!

Also Read: Sara Ali Khan Bikini: అయ్య బాబోయ్.. బికినీలో సారా అలీ ఖాన్ మాములుగా లేదుగా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

 

Trending News