AP Cyclone Alert: ఏపీలో ప్రస్తుతం బంగాళాఖాతంలో ఆగ్నేయంగా కొనసాగుతున్న వాయుగుండం కారణంగా ఉత్తర మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది కాస్తా తీవ్రమై తుపానుగా మారవచ్చని ఐఎండీ వెల్లడించింది. ఫలితంగా ఏపీలో భారీ వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ తెలిపింది.
ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని చాలా ప్రాంతాలు జలదిగ్బంధనంలో చిక్కుకున్నాయి. ఇప్పుడిప్పుడే వరదల నుంచి బయటపడుతున్నాయి. ఈ క్రమంలో మరోసారి తుపాను హెచ్చరిక అనేది ఆందోళన కల్గిస్తోంది. ఉత్తర మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 24వ తేదీన అల్పపీడనం ఏర్పడనుంది. ఇది కాస్తా తీవ్రరూపం దాల్చి తుపానుగా మారవచ్చు. దాంతో రానున్న 5-6 రోజుల్లో ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. దక్షిణ కోస్తాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చు.
రానున్న 5-6 రోజుల్లో కాకినాడ, అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, కోనసీమ, అనకాపల్లి, ఎన్టీఆర్, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు పడవచ్చని ఐఎండీ తెలిపింది. తీరం వెంబడి 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీయనున్నాయి. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని అధికారులు అలర్ట్ జారీ చేశారు.
ఇవాళ కూడా ఏపీలోని విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, కృష్ణా, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడనున్నాయి.
Also read: Saturn Transit: శనిగ్రహం నక్షత్రం మారుతోంది ఈ 6 రాశులకు డిసెంబర్ 27 వరకు ఏం జరగబోతోంది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.