AP Politics: ఆంధ్రప్రదేశ్‌లో మహా కూటమి ఏర్పాటు కాబోతోందా..?

AP Politics: ఏపీలో పొత్తు రాజకీయం హాట్ టాపిక్‌గా మారింది. 2024 ఎన్నికలకే టార్గెట్‌గా పార్టీలన్నీ వ్యూహాలకు పదును పెట్టాయి. అధికార వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు పావులు కదుపుతున్నాయి. రాష్ట్రంలో మరోసారి మహాకూటమి ఏర్పాటు అవుతుందన్న ప్రచారం జరుగుతోంది. టీడీపీ పెద్దన్న పాత్ర పోషిస్తుందని రాజకీయ పండితులు సైతం విశ్లేషిస్తున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 9, 2022, 01:57 PM IST
  • ఏపీలో హాట్‌ హాట్‌గా పొత్తు రాజకీయం
  • పవన్‌ వ్యాఖ్యలపై సర్వత్రా చర్చ
  • మహా కూటమి వస్తోందని ప్రచారం
AP Politics: ఆంధ్రప్రదేశ్‌లో మహా కూటమి ఏర్పాటు కాబోతోందా..?

AP Politics: ఏపీలో పొత్తు రాజకీయం హాట్ టాపిక్‌గా మారింది. 2024 ఎన్నికలకే టార్గెట్‌గా పార్టీలన్నీ వ్యూహాలకు పదును పెట్టాయి. అధికార వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు పావులు కదుపుతున్నాయి. రాష్ట్రంలో మరోసారి మహాకూటమి ఏర్పాటు అవుతుందన్న ప్రచారం జరుగుతోంది. టీడీపీ పెద్దన్న పాత్ర పోషిస్తుందని రాజకీయ పండితులు సైతం విశ్లేషిస్తున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

ఆంధ్రప్రదేశ్‌లో గతకొంతకాలంగా పొత్తులపై మాటల యుద్ధం కొనసాగుతోంది. వైసీపీ, టీడీపీ,బీజేపీ, జనసేన నేతలు పరస్పరం పంచ్‌లు పేల్చుకుంటున్నారు. తాజాగా నంద్యాలలో పవన్‌ కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలు సైతం ఏపీ పాలిటిక్స్‌పై ఆసక్తిని పెంచుతున్నాయి. త్వరలో అద్భుతం జరగబోతోందన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చకుండా ప్రత్యామ్నాయ శక్తి రావాలని పిలుపునిచ్చారు. దీంతో టీడీపీతో మరోసారి జనసేన జతకట్టుతుందా అన్న చర్చ జరుగుతోంది. 2014లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేశాయి. మళ్లీ రాబోయే ఎన్నికల్లో ఇదే రిపీట్ అవుతుందని ముందే పరోక్షంగా పవన్ చెప్పారన్న వాదన ఉంది.    

మరోవైపు ఇదే సమయంలో పొత్తులపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో పొత్తులు సహజమని స్పష్టం చేశారు. గతంలో వైఎస్‌ఆర్‌ సైతం మహాకూటమిని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. పొత్తులపై వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. సీఎం జగన్‌కు నిజంగానే ధైర్యం ఉండే భద్రత లేకుండా ప్రజల్లోకి రావాలన్నారు. ఇటు చంద్రబాబు, పవన్ వ్యాఖ్యలు పొత్తులకు పచ్చజెండా ఊపినట్లు కనిపిస్తోంది.

బీజేపీ మాత్రం పొత్తులపై అచితుచి మాట్లాడుతోంది. టీడీపీతో కలిసి పనిచేసేది లేదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఆ పార్టీ వల్ల గతంలో చాలా నష్టపోయామంటున్నారు. ఏపీలో తాము జనసేనతో కలిసి ముందుకు వెళ్తామంటోంది. గతంలోనూ ఇలాంటి పరిస్థితి ఉన్నా..చివరకు టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి ఎన్నికలకు వెళ్లాయి. కేంద్రం, రాష్ట్రంలో పదవులను పంచుకున్నాయి. ఐతే 2017లో ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు వచ్చింది. 2019 ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేశాయి.

చంద్రబాబు(CHANDRA BABU), పవన్‌ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. మొదటి నుంచి ఆ పార్టీలు కలిసే ఉన్నాయంటున్నారు. ఎవరు ఎన్ని కూటములతో వచ్చినా..వైసీపీ(YCP)దే మరోసారి విజయమని స్పష్టం చేస్తున్నారు. సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని చెబుతున్నారు. మొత్తంగా సార్వత్రిక ఎన్నికలకు ముందే ఏపీలో రాజకీయాలు హీట్ ఎక్కాయి. వైసీపీని దెబ్బతీసేందుకు ఎలాంటి కూటమి వస్తుందో చూడాలి.  

Also read:Asani Cyclone: దూసుకొస్తున్న అసని, ఉత్తరాంధ్రకు భారీ వర్షసూచన!

Also read:Curd Benefits For Hair: పెరుగుతో జుట్టుకు కలిగే ప్రయోజనాలేంటో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News