Mahasena Rajesh: పి గన్నవరం నుంచి మహాసేన రాజేశ్ అవుట్, పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటన

Mahasena Rajesh: తెలుగుదేశం పార్టీకు అప్పుడే షాక్ తగిలింది. పోటీ నుంచి తప్పుకుంటున్నానని ఆ పార్టీ అభ్యర్ధి ప్రకటించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జిల్లా పి గన్నవరం నియోజకవర్గ అభ్యర్ధి పోటీ చేయనని స్పష్డం చేశారు. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 2, 2024, 03:16 PM IST
Mahasena Rajesh: పి గన్నవరం నుంచి మహాసేన రాజేశ్ అవుట్, పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటన

Mahasena Rajesh: ఏపీ రాజకీయాల్లో రోజురోజుకూ కీలక పరిణామాలు జరుగుతున్నాయి. తెలుగుదేశం-జనసేన ఉమ్మడి జాబితాలో భాగంగా తెలుగుదేశం ప్రకటించిన 95 స్థానాల్లో ఒకటి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జిల్లా పి గన్నవరం. అయితే అనూహ్య పరిణామాలతో ఇక్కడి అభ్యర్ధి బరిలో నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. 

టీడీపీ-జనసేన పొత్తులో భాగంగా పి గన్నవరం నియోజకవర్గం టికెట్‌ను తెలుగుదేశం పార్టీ మహాసేన రాజేశ్‌కు కేటాయించింది. నియోజకవర్గ పరిధిలోని అయినవిల్లి ఆలయం నుంచి ప్రచారం కూడా ప్రారంభించారు. కానీ అతని అభ్యర్ధిత్వంపై మాత్రం తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. తన కారణంగా తెలుగుదేశం పార్టీకు నష్టం జరుగుతున్నందున స్వచ్ఛంధంగా ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నానని మహాసేన రాజేశ్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. రాజేశ్‌కు టికెట్ కేటాయించగానే స్థానికేతరుడంటూ నియోజకవర్గంలోని టీడీపీ-జనసేన నాయకులు తీవ్రంగానే వ్యతిరేకించారు. మరోవైపు హిందూ దేవుళ్లకు వ్యతిరేకంగా ముఖ్యంగా రాముడిని దూషిస్తూ రాజేశ్ గతంలో చేసిన కొన్ని వీడియోలు బయటకు తీసి కొందరు సోషల్ మీడియాలో ప్రచారం ప్రారంభించారు. 

ఈ నేపధ్యంలో ఏకంగా పోటీ నుంచి తప్పుకుంటున్నట్టుగా మహాసేన రాజేశ్ ప్రకటించారు. కులరక్కసి చేతిలో మరోసారి బలయ్యానని, జగన్ రెడ్డీ గుర్తు పెట్టుకుంటానంటూ స్పష్టం చేశారు. తన కోసం తన పార్టీని చంద్రబాబు, లోకేశ్, పవన్ కళ్యాణ్ ఎవర్నీ తిట్టవద్దని కోరారు. ప్రశ్నించేవారికి టికెట్ ఇస్తే పోటీ చేయకుండా వ్యవస్థలతో తనను అడ్డుకుంటున్నారని, హిందూ ద్వేషిగా చిత్రీకరిస్తున్నారని మహాసేన రాజేశ్ తెలిపారు. తన కారణంగా పార్టీకు చెడ్డపేరు రాకూడదని అందుకే పోటీ నుంచి తప్పుకుంటున్నానని తెలిపారు. 

అయితే ఈ ప్రకటన కేవలం సోషల్ మీడియాకే పరిమితం చేశారా లేక పార్టీ అధిష్టానానికి చేరవేశారా అనేది తెలియాల్సి ఉంది. ఇది కూడా ప్రచారంలో జిమ్మిక్కు అని సానుభూతి కోసం ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని కూడా కొందరు విమర్శిస్తున్నారు. 

Also read: Ys jagan Target: వైఎస్ జగన్ టార్గెట్ ఆ స్థానాలే, విజయమే లక్ష్యంగా ఎత్తుగడలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News