Andhra Pradesh Politics: పోలీసులపై అసత్య కథనాలు.. ఏపీ ఐపీఎస్ అసోసియేషన్ సీరియస్..

Andhra Pradesh Politics: పోలీసుల గౌరవాన్ని దిగజార్చే విధంగా ఇటీవల కొన్ని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలలో వరుస కథనాలు ప్రచురితమౌతున్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై ఏపీ ఐపీఎస్ ఆఫీసర్ల సంఘం సీరియస్ అయ్యింది.   

Written by - Inamdar Paresh | Last Updated : Apr 6, 2024, 07:48 AM IST
  • పత్రికలలో నిరాధార ఆరోపణలు..
  • సీరియస్ అయిన ఏపీ ఐపీఎస్ ల సంఘం..
Andhra Pradesh Politics: పోలీసులపై అసత్య కథనాలు.. ఏపీ ఐపీఎస్ అసోసియేషన్ సీరియస్..

IPS Police Officers Association Serious On controversy Stories On AP Police: తెలుగు రాష్ట్రాలలో ఎన్నికలు సమ్మర్  హీట్ ను మరింత పెంచుతున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు తమదైన స్టైల్ లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే నాలుగు రాష్ట్రాలు, లోక్ సభకు ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. వైనాట్ 175 అంటూ వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారంతో ప్రజల్లోకి వెళ్తుంది. అదేవిధంగా సిద్దం సభల ద్వారా ప్జలకు చేసిన మంచిని సీఎం జగన్ మోహన్ రెడ్డి వివరిస్తున్నారు. మరోకసారి తమ ప్రభుత్వానికి పట్టం కట్టాలని అభ్యర్థిస్తున్నారు.

Read More: Python Climb Tree: భారీ చెట్టును సెకన్లలో ఎక్కేసిన కొండ చిలువ.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో..

ఇక మరోవైపు ఏపీలో.. టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి ఎన్నికల బరిలో నిలబడ్డాయి. ఆయాస్థానాలలో బలమైన అభ్యర్థులను బరిలోకి దింపేందుకు పావులుకదుపుతున్నారు. ప్రస్తుతం దేశంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఆయా రాజకీయ పార్టీలు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయి. వైసీపీలు తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థపై టీడీపీ ఈసీకి అనేక మార్లు ఫిర్యాదులు చేసిన విషయం తెలిసిందే. అదే విధంగా ఏపీ లోని అనేక జిల్లాలలో ఐపీఎస్ అధికారులు, అధికార వైసీపీలకు మేలుచేసేలా ప్రవర్తిస్తున్నారని, టీడీపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసింది.

దీంతో ఆయా జిల్లాలలో ఎన్నికల సంఘం ఎస్పీలను మార్చి, కొత్త వారిని నియమించింది. అయితే.. ఎన్నికల సంఘం కొత్తగా నియమించిన వారిపై కూడా కొన్నిపత్రికలలో వివాదాస్పద కథనాలు ప్రచురించాయి. ముఖ్యంగా ఆంధ్ర జ్యోతిలో అనేక వరుస కథనాలు పోలీసులపై ప్రచురితమౌతున్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై ఏపీ ఐపీఎస్ పోలీసుల సంఘం సీరియస్ గా స్పందించింది. ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్న అధికారుల పట్ల అసత్య కథనాలు ప్రచురించడం సబబు కాదన్నారు.

Read More: Bull Attacks Scooter: వామ్మో.. గంగిరెద్దు ఎంతపనిచేసింది.. షాకింగ్ వీడియో వైరల్..

ఎలాంటి ఫ్రూఫ్ లు లేకుండా కొన్ని పత్రికలు, పొలిటికల్ పార్టీలు పనిగట్టుకుని పోలీసులపై విషపూరిత ప్రచారాలు చేస్తున్నాయన్నారు. తాము పగలనక,రాత్రనక, కుటుంబాలకుదూరంగా ఉండి ఎన్నో ఒత్తిడుల మధ్య విధులు నిర్వహిస్తుంటామని పేర్కొన్నారు. ఇకమీదట సరైన ఆధారాలు లేకుండా, కథనాలు లేదా వ్యాఖ్యాలు చేసే ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, పొలిటిషియన్స్ లపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల సంఘాన్ని కలిసి దీనిపై చర్యలు తీసుకునేలా చూస్తామంటూ ఏపీ ఐపీఎస్ అధికారుల సంఘం ఒక ప్రకటన విడుదల చేసింది. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News