Employees Salarys: సచివాలయ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవలే సచివాలయ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసిన జగన్ సర్కార్.. వేతనాలు కూడా పెంచుతున్నట్లు ప్రకటించింది. పెంచిన వేతనాలను సచివాలయ ఉద్యోగులకు ఈ నెల నుంచే ఇవ్వనున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఇటీవలే ప్రొబేషన్ ఖరారు చేసింది జగన్ ప్రభుత్వం. ఇందులో భాగంగానే ఉద్యోగులకు పే స్కేల్‌తో పాటు డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర అలవెన్స్‌లు పెంచింది. పెరిగిన వేతనాలను చెల్లించేందుకు ఆర్థిక శాఖలో కొత్తగా అదనపు బడ్జెట్ కేటాయింపులు చేసింది. సచివాలయ ఉద్యోగులకు పెంచిన వేతనాలకు సంబంధించి 768 కోట్ల 60 లక్షల రూపాయలు కేటాయించింది.
వేతనాలు పెరిగిన గ్రామ సచివాలయాల ఉద్యోగుల కోసం కేటాయించిన రూ.768.60 కోట్ల నిధులను విడుదల చేసేందుకు ఏపీ ఆర్థిక శాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు గ్రామ సచివాలయ ఉద్యోగుల వేతనాల కోసం ప్రభుత్వం 19 వందల 95 కోట్లు ఇచ్చేది. ఇప్పుడు పెంచిన వేతనాల కోసం అదనంగా కేటాయించిన 768 కోట్ల రూపాయలతో కలిసి మొత్తం 2 వేల 763 కోట్ల రూపాయలు విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. రెగ్యులరైజ్ చేయడంతో పాటు వేతనాలు పెంచినందుకు ఏపీ వ్యాప్తంగా సచివాలయ ఉద్యోగులు థ్యాంక్యూ సీఎం సార్ అంటూ కృతజ్ఞత సభలు నిర్వహిస్తున్నారు. తమకు జీతాలు పెంచడంపై సీఎం జగన్ కు సచివాలయ ఉద్యోగులు ధన్యవాదాలు చెప్పారు.
ప్రొబేషన్ పూర్తి చేసుకున్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు పెరిగిన జీతాలు ఈనెల నుంచే అందుతాయని గ్రామ, వార్డు సచివాలయ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తుల అంకమ్మరావు తెలిపారు. వార్డు సచివాలయాల ఉద్యోగులకు పెరిగిన జీతాల జీవో కూడా ప్రత్యేకంగా విడుదల అవుతుందని ఉన్నతాధికారులు తెలిపారు.
Read also: Thyroid Control Tips: థైరాయిడ్ నియంత్రణలో అద్భుతంగా పనిచేసే సూపర్ ఫుడ్స్ ఇవే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి