25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు: పిల్లి సుభాష్ చంద్రబోస్

ఉగాది నాటికి 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు: పిల్లి సుభాష్ చంద్రబోస్

Last Updated : Aug 8, 2019, 11:00 PM IST
25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు: పిల్లి సుభాష్ చంద్రబోస్

అమరావతి: వచ్చే ఏడాది ఉగాది పండగ నాటికి 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఏపీ ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ ప్రకటించారు. అందుకోసం సాధ్యమైనంత మేరకు స్థలాలను సేకరిస్తాం.. ఇంకా అవసరమైతే భూమిని కొనుగోలు చేస్తామని మంత్రి స్పష్టంచేశారు. రాష్ట్రంలో రెవెన్యూ రికార్డుల వ్యవస్థ, భూముల రికార్డుల నిర్వహణ గురించి ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. జీవశ్చవంలా తయారైన రెవెన్యూ రికార్డుల వ్యవస్థను ప్రక్షాళన చేయడం కోసమే భూముల రీసర్వేకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. 

దేశంలో తొలిసారిగా ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టాన్ని తీసుకొచ్చామని.. పటిష్ఠంగా ఈ చట్టాన్ని అమలు చేయడం ద్వారా మోసపోయినవారికి ప్రభుత్వమే నష్టపరిహారం  చెల్లిస్తుందని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ తేల్చిచెప్పారు.

Trending News