Janasena Seats in Ap: ఏపీలో జనసేన పోటీ చేసే స్థానాలు ఇవేనా, మరి పవన్ ఎక్కడ్నించి

Janasena Seats in Ap: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పొత్తులపై స్పష్టత వచ్చేసింది. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓ వైపు, తెలుగుదేశం-జనసేన-బీజేపీ మరోవైపు సిద్దమయ్యాయి. ఇంకోవైపు కాంగ్రెస్ వామపక్షాలు కలిసి ఉనికి చాటుకునే ప్రయత్నం చేయనున్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 10, 2024, 08:15 PM IST
Janasena Seats in Ap: ఏపీలో జనసేన పోటీ చేసే స్థానాలు ఇవేనా, మరి పవన్ ఎక్కడ్నించి

Janasena Seats in Ap: ఏపీలో మరోసారి 2014 పొత్తులు రిపీట్ అవుతున్నాయి. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో తలపడేందుకు తెలుగుదేశం-జనసేన-బీజేపీ పార్టీలు పొత్తు కుదుర్చుకున్నాయి. ఈ క్రమంలో జనసేన పోటీ చేసే స్థానాలపై క్లారిటీ దాదాపుగా వచ్చింది. కేటాయించిన 24 స్థానాల్లో పోటీ చేస్తుందా లేక మరి కొన్ని స్థానాలు వదులుకుంటుందా అనేది చర్చనీయాంశంగా మారింది.

ఏపీలో తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి మరోసారి సిద్ధమైంది. తెలుగుదేశం మరోసారి ఎన్డీయేలో చేరింది. బీజేపీ-జనసేనకు కలిపి 8 పార్లమెంట్, 30 అసెంబ్లీ స్థానాలు ఖరారయ్యాయి. బీజేపీ చేరకముందు జనసేనకు 3 పార్లమెంట్ స్థానాలు దక్కినా బీజేపీ వచ్చి చేరడంతో ఓ స్థానం బీజేపీకు వదులుకుంది జనసేన పార్టీ. అంటే జనసేన 2 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయనుంది. ఇక జనసేనకు 24 కేటాయించగా బీజేపీ 6 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయవచ్చు. బీజేపీ ఒకవేళ ఆరింటితో సంతృప్తి చెందకుంటే జనసేనకు కేటాయించిన 24 స్థానాల్లో 2-3 బీజేపీకు ఇవ్వాల్సి ఉంటుంది. 

జనసేన ఇప్పుడు కాకినాడ, మచిలీపట్నం పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయనుంది. అనకాపల్లి పార్లమెంట్ స్థానాన్ని బీజేపీకు వదులుకుంటోంది. ఇక అసెంబ్లీ స్థానాల విషయంలో జనసేన ఇప్పటికే తెనాలి, కాకినాడ రూరల్, నెల్లిమర్లు, అనకాపల్లి, రాజానగరం స్థానాల్ని ప్రకటించింది. అంటే ఇంకా 19 స్థానాలు మిగిలాయి. వీటిలో విజయవాడ వెస్ట్, అవనిగడ్డ, దర్శి, తిరుపతి, రైల్వే కోడూరు, అనంతపురం అర్బన్, రామచంద్రపురం, పిఠాపురం, రాజోలు, రాజానగరం, తాడేపల్లిగూడెం, భీమవరం, నరసాపురం, పోలవరం, ఉంగుటూరు, నిడదవోలు ఉన్నాయి. 

ఇవి కాకుండా పాలకొండ, విశాఖపట్నం దక్షిణం, పెందుర్తి, ఎలమంచిలి ఉన్నాయి. అయితే జనసేనాని పవన్ కళ్యాణ్ ఎక్కడ్నించి పోటీ చేస్తారనేది ఇంకా స్పష్టత రాలేదు. భీమవరం, పిఠాపురం, తాడేపల్లిగూడెం పేర్లు విన్పిస్తున్నాయి. ఈ మూడింటిలో ఒక స్థానాన్ని ఎంచుకోవచ్చు. అదే సమయంలో కాకినాడ లోక్‌సభ నుంచి కూడా పవన్ కళ్యాణ్ పోటీ చేయనున్నారు. 1-2 రోజుల్లో బీజేపీకు ఎన్ని సీట్లు, ఎక్కడెక్కడ ఇస్తారనేది ఖరారు కానుంది. ఆ తరువాతే జనసేన సీట్లపై అధికారికంగా ప్రకటన వెలువడనుంది. 

Also read: Vande Bharat Trains: విశాఖపట్నం నుంచి మరో రెండు వందేభారత్ రైళ్లు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News