కేంద్ర కేబినెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. రాష్ట్ర విభజన సమయంలో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగింది అని అన్నారు. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ చాలా నష్టపోయింది. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదు. అందువల్లే తాము కేంద్రానికి దూరంగా జరుగుతున్నాం అని చంద్రబాబు స్పష్టంచేశారు.
ఇది రాజకీయాలు చేసే సమయం కాదు.. ఇప్పుడు రాజకీయాలు ముఖ్యం కానేకాదు. ప్రజలు అందరు సంఘటితంగా వుండాలి. ఏపీ వాసులు తమ హక్కులు సాధించుకునే విషయంలో జపాన్ తరహాలో కష్టపడాలి. కసితో మన హక్కులు మనం సాధించుకోవాలి అని చెబుతూ ఈ సమస్యపై స్పందిస్తున్న ప్రతీ ఒక్కరికీ చంద్రబాబు ధన్యావాదాలు తెలిపారు.