/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

APCC Chief YS Sharmila Fires On CM YS Jagan: ఆంధ్రప్రదేశ్‌ లో సింహాల లెక్క ఉద్యమం చేయకుంటే ప్రత్యేక హోదా ఎప్పిటికి రాదని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా అన్నారు.  ప్రత్యేక హోదా సాధన లక్ష్యంగా  ప్రతిజ్ఞ పూనిన APCC చీఫ్ వైఎస్ షర్మిలా, భావోద్వేగ పూరిత ప్రసంగం చేశారు. ఈ క్రమంలో మాట్లాడుతూ.. హోదాపై 10 ఏళ్లుగా టీడీపీ, వైఎస్సార్సీపీ  ఆంధ్రులను గొర్రెలను చేశాయంటూ కన్నీటి పర్యంతం అయ్యారు.  సింహాల లెక్క ఉద్యమం చేయక పోతే హోదా ఎప్పటికీ రాదని అన్నారు. పదేళ్ల తర్వాత హోదా అనే ఊసే లేదని, హోదా అంటే ఏంటో అని వింతగా చూస్తున్నారని పేర్కొన్నారు.

Read More: Dried Fruit: ఈ డ్రైఫ్రూట్స్ తీసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందుతారు..‌

కాంగ్రెస్ ప్రత్యేక హోదా కోసం ఉద్యమించాలని నిర్ణయించుకుంది.  ప్రత్యేక హోదా ఉద్యమాన్ని బుజాన ఎత్తుకున్నది కాంగ్రెస్ పార్టీ అని వివరించారు.  ఉద్యమం ఉవ్వెత్తున జరగక పోతే మనకు హోదా రాదని, 10 ఏళ్లలో ఏ ఒక్కరూ పోరాటం చేసింది లేదన్నారు.  ప్రత్యేక హోదా - ఆంధ్రుల హక్కు అని,  అంబేడ్కర్ ప్రజలు  గొర్రెలు లెక్క కాదు...సింహాల లెక్క బ్రతకాలని ఆమె షర్మిలా అన్నారు. ఎవరైన గొర్రెలను బలి ఇస్తారు కానీ.. సింహాలను బలి ఇవ్వరని అన్నారు.  హోదా విషయంలో మనం 10 ఏళ్లు గొర్రెలు అయ్యాం,  అందుకే మనల్ని బలి ఇచ్చారని షర్మిలా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మొదటి 5 ఏళ్లు చంద్రబాబు,  తర్వాత జగన్ మరో 5 ఏళ్లు గొర్రెలను చేశాడని విరుచుకుపడ్డారు.

ఇప్పుడు మనం గొర్రెలం కాదు సింహాలం, సింహాల లెక్క పోరాటం చేయక పోతే హోదా రాదని ఆమె అన్నారు.  పోరాడితే పోయేది ఏమి లేదు..బానిస సంకెళ్లు తప్పా..  ఇన్నాళ్లు మనం మంచితనం గా ఉన్నది చాలు,  మంచితనం ఉంటే మనకు హోదా ఇచ్చారా ?.. మంచితనంగా ఉంటే పోలవరం కట్టారా?.. అన ఆమె ప్రజలను ప్రశ్నించారు. ఆంధ్రులను మోసం చేసిన మోడీ ఒక డి ఫాల్టర్, మోడీ ఒకకేడీ అని, హోదా వచ్చి ఉంటే మన రాష్ట్రం ఎక్కడో ఉండేది, హోదా వస్తె 15 లక్షల కోట్ల రూపాయలు వచ్చేవన్నారు.

అభివృద్ధిలో ఎక్కడో ఉండే వాళ్ళమని,  చంద్రబాబు కి రాష్ట్ర అభివృద్ధి ఇష్టం లేదని షర్మిల అన్నారు. తన తండ్రి రక్తం పంచుకు పుట్టిన జగన్ ఆన్న కి సైతం అభివృద్ధి ధ్యాస లేదని ఆమె వ్యాఖ్యలు చేశారు.  మాట ఇచ్చి మడత పెట్టిన ఘనత జగన్ దని, జలయజ్ఞం కింద YSR కట్టిన ప్రాజెక్ట్ లకి దిక్కులేదు.. వ్యక్తిగత రాజకీయాల కోసం నేను ఆంధ్ర కు రాలేదని అన్నారు.  నాకు రాజకీయాలు కావాలంటే 2019 లోనే ఇక్కడ పార్టీ పెట్టే దాన్ని ఆమె స్పష్టం చేశారు.

Read More: Leopard Enters Office: బుడ్డోడి తెలివి మాములుగా లేదుగా.. గదిలో చిరుతను బంధించిన ఏంచేశాడో తెలుసా..?.. వీడియో వైరల్..

కేవలం హోదా సాధన,విభజన సమస్యల సాధన కోసమే అడుగు పెట్టానని, రాహుల్ ఇచ్చిన మాట పట్టుకొని YSR బిడ్డ ఆంధ్రలో అడుగు పెట్టింది. హోదాపై మొదటి సంతకం పెడతా అని హామీ ఇచ్చారు కాబట్టే వచ్చా..హోదా లేకపోతే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి లేనే లేదు.. హోదా రాకపోతే మన బిడ్డలకు ఉద్యోగాలు రావు, మన రాష్ట్రానికి భవిష్యత్ లేనే లేదు.. ప్రత్యేక హోదా మనకు ఊపిరిఅంటూ వైఎస్ షర్మిలా వ్యాఖ్యలు చేశారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Section: 
English Title: 
Andhra Pradesh APCC YS Sharmila Reddy Emotional Comments On YSRCP YS Jagan Mohan Reddy Over AP Special Status Issue pa
News Source: 
Home Title: 

APCC Chief Sharmila: కన్నీటి పర్యంతం అయిన APCC చీఫ్.. ప్రత్యేక హోదాపై కీలక వ్యాఖ్యలు చేసిన షర్మిలా రెడ్డి.. 

APCC Chief YS Sharmila: కన్నీళ్లు పెట్టుకున్న వైఎస్ షర్మిలా.. మరోసారి ప్రత్యేక హోదాపై కీలక వ్యాఖ్యలు..
Caption: 
YS Sharmila (file)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

పదేళ్లు ఏపీ  ప్రజలకు గొర్రెలను చేశారు..

హోదా వస్తే 15 లక్షల కోట్ల రూపాయలు వచ్చేవన్న వైఎస్ షర్మిల

Mobile Title: 
APCC Chief YS Sharmila: కన్నీళ్లు పెట్టుకున్న వైఎస్ షర్మిలా.. మరోసారి ప్రత్యేక హోదా
Inamdar Paresh
Publish Later: 
No
Publish At: 
Thursday, March 7, 2024 - 14:10
Created By: 
Indamar Paresh
Updated By: 
Indamar Paresh
Published By: 
Indamar Paresh
Request Count: 
35
Is Breaking News: 
No
Word Count: 
393