AP 10th Supplementary Results: ఎట్టకేలకు ఏపీ టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు వచ్చేశాయి. ఫలితాలను మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో విడుదల చేశారు. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాసిన వారికి గ్రేడ్లు ఇవ్వాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. పరీక్ష ఫీజుకు సైతం మినహాయింపు ఇచ్చింది. జులై 6 నుంచి 15 వరకు సప్లిమెంటరీ పరీక్షలు జరిగాయి.
మొత్తం లక్షా 91 వేల 600 మంది పరీక్షలు రాశారు. ఫలితాల్లో బాలికలు 68.76 శాతం, బాలురు 60.83 శాతం ఉత్తీర్ణత సాధించారు. మొత్తంగా లక్షా 23 వేల 231 మంది పాస్ అయ్యారు. అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 87.52 శాతం, పశ్చిమగోదావరి జిల్లాలో అత్యల్పంగా 46.66 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఈఏడాది ఏప్రిల్‌లో జరిగిన పరీక్షాల్లో గతంలో ఎన్నడు లేనివిధంగా రెండు లక్షల మందికి పైగా విద్యార్థులు ఫెయిలయ్యారు. ఉత్తీర్ణత శాతం 67.26గా నమోదు అయ్యింది.
రెగ్యులర్, అడ్వాన్స్ సప్లిమెంటరీల్లో ఆరు లక్షల 6 వేల 070 మంది పరీక్షలు రాయగా.. 5 లక్షల 37 వేల 491 మంది పాస్ అయ్యారు. మొత్తం 88.68 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఈఏడాది సప్లిమెంటరీ పరీక్షల్లో పాసైన వారిని రెగ్యులర్‌గానే పరిగణిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. కోవిడ్ కారణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. విద్యార్థులతో చూసి రాయించడం, అందర్నీ పాస్ చేయాలనే ఉద్దేశంతో పరీక్షలు నిర్వహించలేదన్నారు.
ప్రభుత్వం చేసే ప్రతి చట్టం ప్రజాభిప్రాయంతో చేయాలంటే కుదరదని చెప్పారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఎన్నుకున్న ఎమ్మెల్యేలు ఉన్నారని..అందుకే విలీన ప్రక్రియలో వీరి అభిప్రాయం తీసుకున్నామన్నారు మంత్రి. పిల్లలు గొప్ప వాళ్లు కావాలి..పెద్ద వాళ్లు కావాలని కోరుకునే తల్లిదండ్రులు ఇంటి పక్కనే స్కూల్ ఉండాలని కోరుకోకూడదన్నారు.
Also read:ED on Casino: క్యాసినో వ్యవహారంలో సినీ తారలు..నోటీసులకు సిద్ధమవుతున్న ఈడీ..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook