కేంద్ర బడ్జెట్ లో ఏపీకి అన్యాయం జరగలేదు

ఆదివారం ఉదయం విజయవాడలో రాష్ట్ర బీజేపీ పార్టీ సమావేశమైంది. రాష్ట్ర బీజేపీ చీఫ్ హరిబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ సీనియర్ లీడర్లు పురందేశ్వరి, కన్నా లక్ష్మినారాయణ, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎంఎల్ఏలు పాల్గొన్నారు.

Last Updated : Feb 18, 2018, 03:57 PM IST
కేంద్ర బడ్జెట్ లో ఏపీకి అన్యాయం జరగలేదు

ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను కేంద్రం సక్రమంగా అమలుచేయడం లేదని, తామెంతో అసంతృప్తితో ఉన్నామని, రాష్ట్రానికి న్యాయం జరిగేవరకు పోరాటం చేస్తామని, అందుకోసం ఏ త్యాగానికైనా వెనకాడబోమని శనివారం టీడీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో.. ఆదివారం ఉదయం విజయవాడలో రాష్ట్ర బీజేపీ పార్టీ సమావేశమైంది. రాష్ట్ర బీజేపీ చీఫ్ హరిబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ సీనియర్ లీడర్లు పురంధరేశ్వరి, కన్నా లక్ష్మినారాయణ, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎంఎల్ఏలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ చీఫ్ మాట్లాడుతూ- ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ఎల్లప్పుడూ సహకారం అందిస్తుందని అన్నారు. కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని చెప్పారు. రెవెన్యూ లోటును భర్తీ చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉందని.. అధికారులు ఇవ్వాల్సిన నిధుల గురించి చర్చిస్తున్నామని ఆయన అన్నారు.

'కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు అంగీకరిస్తున్నామని కేంద్రమంత్రి చెప్పారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం వద్ద కొన్ని పరిష్కరించే అంశాలు ఉన్నాయి. ఆ తరువాతే కేంద్రం ఈ కర్మాగారం ఏర్పాటు విషయంలో ముందడుగు వేస్తుంది. కేంద్రం రైల్వే జోన్ పై కూడా నిర్ణయం తీసుకుంటుంది. విభజన హామీల చట్టం త్వరలోనే అమలవుతుంది. నేషనల్ యూనివర్సిటీ నిర్మాణానికి నిధులు సమకూరుతున్నాయి. కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం జరిగిందనడంలో వాస్తవం లేదు' అని హరిబాబు అన్నారు.  బీజేపీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన వారికి గట్టిగా సమాధానాలు ఇవ్వాలని ఆయన అన్నారు.

Trending News