పవన్ కల్యాణ్ కాన్వాయ్ ఢీకొని అభిమానికి గాయాలు

పవన్ కల్యాణ్ చేపట్టిన అనంతపురం పర్యటనలో ఓ అపశృతి చోటుచేసుకుంది

Last Updated : Jan 30, 2018, 06:44 AM IST
పవన్ కల్యాణ్ కాన్వాయ్ ఢీకొని అభిమానికి గాయాలు

సినీనటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన అనంతపురం పర్యటనలో ఓ అపశృతి చోటుచేసుకుంది. మూడు రోజుల అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా పవన్ కల్యాణ్ ఆదివారం కదిరి నుంచి పుట్టపర్తి వెళ్తుండగా అతడి కాన్వాయ్‌లోని ఓ వాహనం ఢీకొన్న ఘటనలో ఓ అభిమానికి గాయలయ్యాయని తెలుస్తోంది. 

పవన్ కల్యాణ్ వస్తున్నారని తెలిసి పెద్ద సంఖ్యలో రోడ్డుపైకి దూసుకొచ్చిన అభిమానులు.. నల్లమడ గ్రామం వద్ద పవన్ కాన్వాయ్‌ని చేరుకుని అతడితో కరచాలనం చేసేందుకు పోటీపడ్డారు. ఈ క్రమంలోనే మహేష్ అనే యువకుడు కాన్వాయ్ కిందపడగా కాన్వాయ్‌లోని ఓ వాహనం అతడిపై నుంచి వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో మహేష్ కాలు విరిగినట్టు వార్తా కథనాలు స్పష్టంచేస్తున్నాయి. వెంటనే అప్రమత్తమైన పవన్ కల్యాణ్ కాన్వాయ్‌ని ఆపి, బాధితుడికి అత్యవసరం వైద్య సహాయం అందేలా చర్యలు తీసుకోవాల్సిందిగా తన పార్టీ క్యాడర్‌కి సూచించారని సమాచారం. 

Trending News