Akkireddy Gudem Fire Accident: ఏలూరు జిల్లా అక్కిరెడ్డిగూడెంలోని పోరస్ కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన అగ్నిప్రమాద ఘటన స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది. ప్రమాదంలో ఆరుగురు మృతి చెందడంతో గ్రామస్తులు ఫ్యాక్టరీ ఎదుట ఆందోళనకు దిగారు. మాకొద్దీ పరిశ్రమ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామం నుంచి పరిశ్రమను తరలించాలని డిమాండ్ చేశారు. కెమికల్ ఫ్యాక్టరీ కారణంగా నీళ్లు, గాలి కలుషితమవుతున్నాయని... దాంతో గ్రామస్తులు రోగాల బారినపడుతున్నారని ఆరోపించారు.
కెమికల్ ఫ్యాక్టరీ నుంచి ఇక్కడి నుంచి తరలించాలని గతంలోనూ చాలాసార్లు డిమాండ్ చేసినప్పటకీ అధికార యంత్రాంగం పట్టించుకోలేదని గ్రామస్తులు తెలిపారు. ఫ్యాక్టరీ లోపలికి గ్రామస్తులు చొచ్చుకెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో అక్కడ స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఘటనపై స్థానిక వ్యక్తి ఒకరు మాట్లాడుతూ.. కెమికల్ ఫ్యాక్టరీ కారణంగా పంటలు కూడా నాశనమవుతున్నాయని అన్నారు. గతంలో పశువులు కూడా చనిపోయాయని అన్నారు. ఇకనైనా ఫ్యాక్టరీని మూసివేయాలని డిమాండ్ చేశారు.
కాగా, అక్కిరెడ్డిగూడెంలోని పోరస్ కెమికల్ ఫ్యాక్టరీలో గత రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకోగా నలుగురు సజీవ దహనమయ్యారు. మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఫ్యాక్టరీలోని యూనిట్-4లో గ్యాస్ లీకై మంటలు చెలరేగగా రియాక్టర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో దాదాపు 50 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఫ్యాక్టరీ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.
కెమికల్ ఫ్యాక్టరీ తాత్కాలికంగా మూసివేత :
పోరస్ కెమికల్ ఫ్యాక్టరీని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రసన్న కుమార్ వెల్లడించారు. కంపెనీ నిబంధనలు ఉల్లంఘించిందా... ప్రమాదకర రసాయనాలను వినియోగించారా అనేవి విచారణలో తేలుతాయన్నారు. హైప్రెజర్ వల్లే కెమికల్ రియాక్షన్ జరిగిందా అన్నది పరిశీలిస్తున్నామని చెప్పారు. ప్రమాదంలో మృతి చెందినవారి కుటుంబాలకు ప్రభుత్వం తరుపున రూ.25 లక్షల పరిహారంతో పాటు కంపెనీ నుంచి కూడా రూ.25 లక్షలు పరిహారం అందనుంది.
Also Read: Monitor Lizard Raped: షాకింగ్... ఉడుముపై గ్యాంగ్ రేప్... సెల్‌ఫోన్లలో చిత్రీకరణ...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook