11 TDP MLAs Suspended: ఏపీ అసెంబ్లీలో సస్పెన్షన్‌ల పర్వం కొనసాగుతోంది. రెండోరోజు టీడీపీ సభ్యులు సస్పెండ్ అయ్యారు. సభా కార్యకలాపాలకు అడ్డుపడుతున్నారని 11 మంది టీడీపీ సభ్యులపై స్పీకర్ తమ్మినేని సీతారామ్ వేటు వేశారు. సస్పెన్షన్ తీర్మానాన్ని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రవేశపెట్టారు. దీనిపై స్పీకర్ చర్యలు తీసుకున్నారు.
సస్పెండ్‌కు గురైన వారిలో టీడీపీ ఎమ్మెల్యేలు నిమ్మకాలయ చినరాజప్ప, వెలగపూడి రామకృష్ణబాబు, అశోక్, గొట్టిపాటి రవికుమార్, ఆదిరెడ్డి భవాని, గణబాబు, జోగేశ్వరరావు, గద్దె రామ్మోహన్, ఎం.రామరాజు,ఏలూరి సాంబశివరావు, అనగాని సత్యప్రసాద్‌లు ఉన్నారు. వీరిని ఒక్కరోజుపాటు శాసనసభ నుంచి సస్పెండ్ చేశారు. నిన్న ఐదుగురు టీడీపీ ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేశారు. వారిపై బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యే వరకు సస్పెన్షన్ వేటు వేశారు.
రెండురోజుల రోజులుగా జంగారెడ్డిగూడెం అంశం..ఏపీ అసెంబ్లీని కుదిపేస్తోంది. దీనిపై చర్చ చేపట్టాలని టీడీపీ పట్టుబడుతోంది. రెండురోజులుగా దీనిపై వాయిదా తీర్మానాలను సైతం ఇచ్చింది. వీటిని స్పీకర్ తిరస్కరించారు. టీడీపీ సభ్యుల తీరుపై సీఎం జగన్, మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. దీనిపై చర్చకు సిద్ధమన్నారు. టీడీపీ సభ్యులే..అసెంబ్లీని తప్పుదారి పట్టిస్తున్నారని ఫైర్ అయ్యారు. జంగారెడ్డిగూడెంలో సహజ మరణాలే చోటుచేసుకున్నాయని సీఎం జగన్ ప్రకటించారు. ఈ అంశాన్ని ప్రతిపక్షాలు రాద్ధాంతం చేసి..రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నాయన్నారు.
Also Read: Vivo Holi Offer: హోలీ సందర్భంగా స్మార్ట్ ఫోన్స్ పై స్పెషల్ ఆఫర్స్ ప్రకటించిన వివో!
Also Read: Russian Model Murdered: పుతిన్ పై విమర్శలు చేసిన రష్యన్ మోడల్ మృతి.. సూటుకేసులో మృతదేహం లభ్యం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook