Karate Kalyani: గోవుల రక్షణ కోసం సినీ నటి కరాటే కల్యాణి రెచ్చిపోయారు. ఏపీలోని విజయనగరంలో హల్‌చల్ చేసి పోలీసులను ముప్పుతిప్పలు పెట్టారు. గో రక్షణ కోసం ఆమె పోరాటం ప్రారంభించారు. గోవులను వధశాలలకు తరలిస్తున్నారని ఆరోపిస్తూ ఆమె ఆందోళన చేపట్టారు. ఒంటరిగా ఆమె రోడ్డుపై కూర్చొని నిరసన చేపట్టారు. వాహనానికి అడ్డంగా కూర్చొని ధర్నా చేశారు.
Also Read: Adudam Andhra: ఆడుదాం ఆంధ్రా పనికి మాలిన ప్రోగ్రామ్.. రోజా అవినీతిని కక్కిస్తాం
తెలుగు రాష్ట్రాల్లో గోవులను కబేళాలకు తరలిస్తున్న సంఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. మొన్న తెలంగాణలో బక్రీద్ సందర్భంగా గోవులను తరలిస్తుంటే ఇద్దరు యువతులు ధైర్యంగా ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఆ ఇద్దరు యువతులను ఎమ్మెల్యేలు, కేంద్ర మంత్రులు ప్రశంసిస్తున్నారు. తాజాగా సినీ నటి కరాటే కల్యాణి కూడా ఆ యువతుల మాదిరి రెచ్చిపోయారు. గోవులను కబేళాలకు తరలిస్తున్నారనే సమాచారం తెలుసుకున్న ఆమె వెంటనే అక్కడకు చేరుకుని అడ్డుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
Also Read: Free Bus Scheme: ఏపీ మహిళలకు సూపర్బ్ న్యూస్.. ఉచిత బస్సు ప్రయాణం ఎప్పటి నుంచి అంటే..
విజయనగరం జిల్లా కొత్తవలస మండలం గనిశెట్టిపాలెంలో 60 గోవులతో వెళ్తున్న లారీని ఆదివారం కరాటే కల్యాణి అడ్డుకున్నారు. గోశాలకు తరలిస్తున్నామని అని చెప్పి కబేళాకు గోవులను తరలించడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కబేళా వద్ద బైఠాయించారు. కబేళా (గో వధ శాల)ను సీజ్ చేసే వరకు కదిలేది లేదు అని భీష్మించుకుని కూర్చున్నారు.
ఈ సందర్భంగా కొందరు పోలీస్ అధికారులకు ఫోన్లు చేసి కూడా మాట్లాడారు. వెంటనే గోవులను గోశాలకు తరలించాలని డిమాండ్ చేశారు. దీనికోసం ఎంతదాకైనా పోరాడుతానని ఆమె స్పష్టం చేశారు. కొద్దిసేపు ఆమె పోలీసులతో వాగ్వివాదం చేశారు. కొద్దిసేపటి తర్వాత ఆమెను పోలీసులు శాంతింపచేసినట్లు సమాచారం. కాగా కరాటే కల్యాణిలో గోవుల రక్షణ కోసం ఉద్యమం చేస్తున్నారు. ఆమె బీజేపీలో కార్యకర్తగా కొనసాగుతున్నారు.
గో రక్షకులకు అభినందన
కబేళాకు తరలిస్తున్న గోవులను అడ్డుకున్న మహిళలను కేంద్ర మంత్రి బండి సంజయ్ అభినందించారు. జూన్ 15వ తేదీన ఓల్డ్ మలక్‌పేటలో గోవులను తరలిస్తుండగా వనిత, మైథిలీ అనే ఇద్దరు యువతులు అడ్డుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయం తెలుసుకున్న బండి సంజయ్ వారితో ఫోన్‌లో మాట్లాడి తన నివాసానికి పిలిచారు. ఈ సందర్భంగా ఆ యువతలను సన్మానించి వారితో కలిసి భోజనం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter