Andhra pradesh: వాలంటీర్లు కౌన్సిలర్లుగా, కార్పొరేటర్లుగా ఎన్నికవడం చూశాం. ఇప్పుడిక ఏకంగా కూరగాయలమ్మే వ్యక్తి మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికయ్యారని తెలుసా. ఏపీలోని ఓ మున్సిపాలిటీలో అదే జరిగింది.
ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన పంచాయితీ, మున్సిపల్ ఎన్నికల్లో వాలంటీర్లు సర్పంచ్‌లుగా, కౌన్సిలర్లుగా, కార్పొరేటర్లుగా ఎన్నికై సంచలనం కల్గించారు. ఇప్పుడు అంతకంటే సంచలనమైన ఘటన చోటుచేసుకుంది. ఏకంగా కూరగాయలమ్మేవ్యక్తి మున్సిపల్ ఛైర్మన్‌గా ఎన్నికయ్యాడు. కడప జిల్లా రాయచోటి మున్సిపాలిటీలో జరిగిన ఈ విచిత్ర ఘటన నేపధ్యమిదీ.
రాయచోటి (Rayachoti) లో షేక్ బాష అనే వ్యక్తి డిగ్రీ వరకూ చదువుకున్నాడు. ఉద్యోగం లేకపోవడంతో గ్రామంలోనే కూరగాయలు అమ్ముతూ జీవనం కొనసాగిస్తున్నాడు. స్థానంగా ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్నాడు. మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (Ysr congress party)షేక్ బాషకు కౌన్సిలర్‌గా టికెట్ ఇచ్చింది. వార్డు ప్రజలు బాషను గెలిపించుకున్నారు. అక్కడితో అతని అదృష్టం ఆగలేదు. సమీకరణాలో..మరేంటో తెలియదు గానీ..పార్టీ అతనికి మరో ఊహించని అవకాశాన్ని వరంగా ఇచ్చింది. మున్సిపల్ ఛైర్మన్ పదవికి షేక్ బాషను ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకుంది. అంతే..ఇంకేముంది రాయచోటి మున్సిపల్ ఛైర్మన్‌గా షేక్ బాష ఎన్నికయ్యాడు. జీవితంలో ఊహించని ఇంతటి అవకాశాన్ని కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ap cm ys jagan) కు కృతజ్ఞతలు చెబుతున్నాడు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వెనుకబడిన వర్గాలకు అధిక శాతం సీట్లు కేటాయించిందని షేక్ బాష చెప్పాడు. మహిళలకు 60.47 శాతం, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 78 శాతం పోస్టుల్ని కేటాయించడం గొప్ప విషయమని ప్రశంసించాడు.
Also read: Mydukur Municipality: ఉత్కంఠ రేపిన మైదుకూరు ఎన్నిక, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook