ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ (CoronaVirus) మహమ్మారి కలకలం రేపుతోంది. రోజు కనీసం 60 కంటే ఎక్కువ కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో మరో 67 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 1650కి చేరింది. మొత్తం పాటిజివ్ కేసులకుగానూ చికిత్స అనంతరం కోలుకుని 524 మంది డిశ్ఛార్జ్ కాగా, ఏపీలో కరోనా బారిన పడి ఇప్పటివరకూ 33 మంది మరణించారు. రోగ నిరోధక శక్తి పెరగడానికి సులువైన మార్గాలు
ప్రస్తుతం 1093 మంది కరోనా వ్యాధికి చికిత్స పొందుతున్నారు. గడిచిన 24 గంటల్లో మొత్తం 10,292 శాంపిల్స్‌ని పరీక్షించగా 67 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. ఈ వివరాలను ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. కర్నూలు జల్లాలో 500కి చేరువలో కరోనా కేసులు రావడం జిల్లా వాసులను భయాందోళనకు గురి చేస్తోంది. లాక్‌డౌన్‌లో మిల్కీ ‘బ్యూటీ’ Photos
బికినీలో బ్యూటీలు.. సమ్మర్ మరింత హాట్!
కర్నూలు జిల్లాలో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. ఆ జిల్లాలో 491 కేసులు నమోదు కావడం గమనార్హం. ఆ తర్వాత గుంటూరు జిల్లాలో 338 కరోనా కేసులు, కృష్ణా జిల్లా 278 కేసులతో కరోనా తీవ్రతను ఎదుర్కొంటున్నాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 25 పాజిటివ్ కేసులు నమోదు కాగా, గుంటూరు జిల్లాలో 19, కృష్ణా జిల్లాలో 12, విశాఖలో 6, కడప జిల్లాలో 4, చిత్తూరు జిల్లాలో ఒక్క కరోనా కేసు చొప్పున నమోదయ్యాయి. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
Photos: కేఎల్ రాహుల్, అతియా శెట్టి క్రేజీగా!
కరోనా కలకలం.. ఓ జిల్లాలో 500కు చేరువలో కేసులు