ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా 48 మందికి కరోనా వైరస్ సోకింది. తాజా కేసులతో కలిపి ఏపీలో ఇప్పటివరకూ నమోదైన కరోనా కేసులు సంఖ్య 2719కి చేరుకుంది. ఈ మొత్తం కేసులకుగానూ చికిత్స అనంతరం కరోనా బారి నుంచి కోలుకుని 1903 మంది డిశ్ఛార్జ్ కాగా, తాజాగా తూర్పు గోదావరి జిల్లాలో ఓ కరోనా మరణం నమోదైంది. ఖతర్నాక్ ఫొటోలు వదిలిన కేథరిన్
గడిచిన 24 గంటల్లో మొత్తం 8148 శాంపిల్స్ సేకరించి పరీక్షలు నిర్వహించగా 48 మందికి కోవిడ్19 పాజిటివ్‌గా నిర్దారించారు. 55 మంది కోవిడ్ నుంచి కోలుకుని పూర్తి ఆరోగ్యంతో ఇంటికి వెళ్లిపోయారు. తాజా మరణంతో కలిపి ఏపీలో ఇప్పటివరకూ కరోనా బారిన పడి 57 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 759 మంది కరోనాకు చికిత్స తీసుకుంటున్నారు. ఎగసిన కెరటం నటి ఐశ్వర్య రాజేష్..
రాష్ట్రంలో తాజాగా నమోదైన కేసులలో చిత్తూరులో నమోదైన కేసులలో నలుగురు తమిళనాడులోని కోయంబేడు నుంచి వచ్చినవారు ఉన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారిలో 111 మందికి కరోనా పాజిటివ్‌గా గుర్తించారు. తాజాగా నమోదైన 49 కేసులలో కువైట్ నుంచి 44 కేసులు, అబుదాబి నుంచి 3, ఖతర్ నుంచి వచ్చినవారిలో ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా తేలింది. షూటింగ్ సెట్ ధ్వంసం చేసి వీడియోలు.. సీఎం ఆగ్రహం
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో ఇప్పటివరకూ 153 కరోనా కేసులు నమోదు కాగా, మహారాష్ట్ర నుంచి 101, గుజరాత్ నుంచి 26, రాజస్థాన్ 11, తమిళనాడు 3, కర్ణాటక 1, పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిన వారిలో ఒకరికి కోవిడ్ పాజిటివ్ ఉన్నారు. గడిచిన 24 గంటల్లో ఇందులో 70 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం 47 యాక్టీవ్ కేసులున్నాయి. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
ఏపీలో తాజాగా 48 కరోనా కేసులు, ఒకరి మృతి