16,207 పోస్టులు.. ఫీజు చెల్లించేందుకు నేడు చివరి తేదీ

Grama Sachivalayam Jobs ఏపీలోని 16,207 గ్రామ సచివాలయ పోస్టులకు దరఖాస్తు ఫీజు చెల్లించడానికి జనవరి 30 చివరి తేదీ. నేడు దరఖాస్తు చెల్లించని వారికి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోలేరు.

Last Updated : Jan 30, 2020, 07:46 AM IST
16,207 పోస్టులు.. ఫీజు చెల్లించేందుకు నేడు చివరి తేదీ

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామ సచివాలయాల్లో 16,207 గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీలో కీలకమైన ప్రక్రియ నేటితో ముగియనుంది. అభ్యర్థులు తమ పరీక్షా ఫీజును ముందుగా చెల్లించాల్సి ఉంటుంది. తర్వాత ఉద్యోగానికి ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాలి. జనవరి 30న దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరితేదీ అని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.  ఆన్‌లైన్ దరఖాస్తుకు జనవరి 31 చివరి తేదీ. దరఖాస్తు ఫీజు చెల్లించని అభ్యర్థులు నేడు చెల్లిస్తేనే ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అవకాశం లభిస్తుంది.

అభ్యర్థులు పరీక్ష ఫీజుగా రూ.200, దరఖాస్తు ఫీజుగా రూ.200 మొత్తం 400 రూపాయాలు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు కల్పించారు. సొంత జిల్లాలకు కాకుండా వేరే జిల్లాల పోస్టులకు దరఖాస్తు చేసుకునే నాన్‌-లోకల్ అభ్యర్థులు వారు జిల్లాకు అదనంగా రూ.100 చెల్లించాలి. పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ జనవరి 10న ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.

అభ్యర్థుల వయోపరిమితి విషయానికొస్తే.. 01.01.2O20 నాటికి 18 - 42 సంవత్సరాల వయసు మధ్య ఉండాలి. 02.07.1978 - 01.07.2002 మధ్య జన్మించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులుగా పరిగణిస్తారు. నోటిఫికేషన్‌లో పేర్కొన్న నిబంధనల ప్రకారం కొందరికి వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. వీఆర్వో గ్రేడ్-2 పోస్టులకు పదోతరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. మిగతా పోస్టులకు సంబంధిత విభాగంలో డిగ్రీ లేక కోర్సు సర్టిఫికేట్ ఉన్నవారు అర్హులు. పూర్తి వివరాలకు నోటిఫికేషన్ లింక్ మీద క్లిక్ చేయండి.

దరఖాస్తు ఫీజు చెల్లించడానికి ఇక్కడ క్లిక్ చేయండి

నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి

గ్రామ సచివాలయం వెబ్‌సైట్ కోసం క్లిక్ చేయండి

గ్రామ సచివాలయ ఉద్యోగాలు
పోస్టులు                - ఉద్యోగాలు
పంచాయతీ కార్యదర్శి గ్రేడ్-5    -    61
వెటర్నరీ అసిస్టెంట్        -    6,858
విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్    -    1782
విలేజ్ సర్వేయర్ గ్రేడ్-3        -    1255
డిజిటల్ అసిస్టెంట్        -    1134
ఏఎన్‌ఎం గ్రేడ్-3            -    648
విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ గ్రేడ్-2    536

విలేజ్ వెల్ఫేర్ సెక్రటరీ        -    762
ఇంజినీరింగ్ అసిస్టెంట్        -    570
వీఆర్వో గ్రేడ్-2            -    246
వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్    -    97
విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్    -    69
విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్    -    43
 మొత్తం ఉద్యోగాలు              -              14,061

వార్డు సచివాలయ ఉద్యోగాలు
పోస్టులు                    - ఉద్యోగాలు
వార్డ్ ప్లానింగ్, రెగ్యులేషన్ సెక్రెటరీ    -    844
వార్డ్ శానిటేషన్, ఎన్విరాన్‌మెంట్ సెక్రెటరీ    -    513
వార్డ్ అమినిటీస్ సెక్రటరీ            -    371
వార్డ్ వెల్ఫేర్, డెవెలప్‌మెంట్ సెక్రెటరీ    -    213
వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రెటరీ        -    105
వార్డ్ ఎడ్యుకేషన్, డేటా ప్రాసెసింగ్ సెక్రెటరీ-    100
 మొత్తం పోస్టులు               -                2,146

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News