YSRCP Rajya Sabha MPs: అసెంబ్లీ ఎన్నికల్లో చరిత్రలో ఎవరూ ఎదుర్కోని ఘోర పరాభవాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఆ పార్టీ కథ ఇక ముగిసినట్టే అని అందరూ అనుకుంటున్నట్టుగానే జరుగుతున్నాయి. ఆ పార్టీ పతనం అంచుకు చేరుకున్నట్టు కనిపిస్తోంది. అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీలో నాయకులు ఉండలేకపోతున్నారు. గౌరవప్రదమైన సీట్లు కూడా రాకపోవడంతో పార్టీ నాయకులు అవమానంగా భావిస్తున్నారు. భవిష్యత్‌లో పార్టీ పుంజుకోదని భయం.. అధికార పార్టీ వేధింపులకు పాల్పడుతుందనే మరో ఆందోళనతో వైఎస్సార్‌సీపీలో ఇమడలేకపోతున్నారు.
Also Read: Big Shock To YSRCP: జగన్‌కు షాక్‌ల మీద షాక్.. ఎమ్మెల్సీ పోతుల సునీత రాజీనామా
దీనికితోడు పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ తీరుతో ఎప్పటి నుంచో అసహనంతో ఉన్న వారంతా పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. అయితే అది ఏ స్థాయిలో అంటే ఆ పార్టీ తుడిచిపెట్టుకుపోయే స్థితిలో అంతటి సంఖ్యలో నాయకులు రాజీనామాలకు సిద్ధమయ్యారు. తాజాగా పార్లమెంట్‌లో కీలకమైన రాజ్యసభలో ఏకంగా ఉనికి కోల్పోయే స్థితిలో వైఎస్సార్‌సీపీలో రాజీనామాలు ఉంటాయని చర్చ జరుగుతోంది.
Also Read: Chandrababu: ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు అసహనం.. మీ వలన పరువు పోతుంది!
పార్టీ సంక్షోభంలో నెట్టే పనిని ఎంపీ మోపిదేవి వెంకటరమణ శ్రీకారం చుట్టినట్లు కనిపిస్తోంది. ఆయనతో మొదలైన రాజీనామాలు రాజ్యసభలో వైఎస్సార్‌సీపీ విలీనమే లక్ష్యంగా సాగుతోంది. ఈ క్రమంలోనే 10 మంది రాజ్యసభ సభ్యులు వేరే పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కూటమి పార్టీల కండువాలు కప్పుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
అందులో భాగంగా తెలుగుదేశం పార్టీలోకి ముగ్గురు, బీజేపీలోకి ఐదుగురు, జనసేనలోకి ఇద్దరు చేరతారనే చర్చ జరుగుతోంది. ఈ మేరకు మంచి ముహూర్తం కోసం ఎదురుచూస్తున్నట్లు సమాచారం. వస్తున్న సమాచారం ప్రకారం గురువారం రాజ్యసభ చైర్మన్‌ను ఈ ఎంపీలు కలిసి తమ రాజీనామాలు పత్రాలు సమర్పించే అవకాశం ఉంది. ఇక వారితో పాటు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు పార్టీ మారనున్నారు.
విశ్వసనీయ సమాచారం ప్రకారం వైఎస్సార్‌సీపీ ఎంపీలు ఏ పార్టీలో చేరతారనేది తెలిసింది. ఏయే ఎంపీ ఏ పార్టీలో చేరతారో జాబితా ఇదే!
తెలుగుదేశం: మోపిదేవి వెంకటరమణ, గొల్ల బాబూరావు, బీద మస్తాన్‌రావు
బీజేపీ: రఘునాథ్ రెడ్డి, నిరంజన్‌రెడ్డి, అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వాని
జనసేన: పిల్లి సుభాష్ చంద్రబోస్, ర్యాగ కృష్ణయ్య
ఒకే ఒక్కడు ఎవరు?
పది మంది రాజీనామాలతో వైఎస్సార్‌సీపీ నిలువునా చీలిపోనుంది. అసలు రాజ్యసభలో ప్రాతినిథ్యం కోల్పోయే అవకాశం కూడా లేకపోలేదు. అయితే ఉన్న 11 మందిలో ఒకరు మాత్రం పార్టీతోనే కొనసాగుతారని సమాచారం. ఆ ఒకే ఒక్క ఎంపీ ఎవరనేది ఆసక్తికరంగా మారింది. కాంట్రాక్ట్‌లు, నిధులు, పదవుల ఆశతో ఆ ఎంపీలు పార్టీ మారనున్నారు. ఒక్కరూ కూడా జగన్ మాటపై నిలబడే అవకాశం లేదు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook