Covid-19 Vaccine: కరోనావైరస్ ( Coronavirus ) సంక్రమణ వల్ల ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది బాధ పడుతున్నారు. ఇప్పటి వరకు సుమారు కోటి 50 లక్షల మందికి వ్యాధి సోకింది. కోవిడ్-19 వల్ల సుమారు 6 లక్షల మంది ( Covid-19 Death ) మరణించారు. ప్రపంచంలోని అనేక దేశాలు వ్యాక్సిన్ తయారు చేయడానికి పోటీ పడుతున్నాయి. త్వరలోనే వ్యాక్సిన్ వస్తుంది అని ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది. ఇలాంటి సమయంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ( WHO ) షాకింగ్ కామెంట్ చేసింది. 2021 కంటే ముందు వ్యాక్సిన్ వచ్చే ఛాన్సే లేదు అని తెలిపింది ప్రపంచ ఆరోగ్య సంస్థ ( World Health Organization ). అదే సమయంలో వ్యాక్సిన్ అందుబాటులోకి దానిని పంపిణీ చేసే విషయంలో ఎలాంటి వివక్షతకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అని తెలిపింది. ( Quarentine Tips: హోమ్ క్వారంటైన్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే )
కరోనావైరస్ వ్యాక్సిన్ కోసం ప్రపంచ వ్యాప్తంగా దిగ్గజ ఫార్మసంస్థలతో వివిధ దేశాల ప్రభుత్త వైద్య సంస్థలు కలిసి పని చేస్తున్నాయి. వ్యాక్సిన్ వచ్చే వరకు కరోనావైరస్ సోకకుండా నిరోధ చర్యలు తీసుకోవడం ముఖ్యం అని డబ్ల్యూహెచ్ఓ అత్యవసర విభాగం అధిపతి మైక్ ర్యాన్ తెలిపారు. వ్యాక్సిన్‌ను ఆదాయ మార్గంగా కాకుండా ప్రపంచ మానవాళి శ్రేయస్సు కోసం సిద్ధం చేయాలి అని.. వ్యాక్సిన ఇప్పుడు అత్యవసరం అని తెలిపారు. అలా వ్యాక్సిన్ తయారు చేస్తున్న సంస్థలతో కలిసి పని చేస్తాం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ( Mask During Workouts: వర్కవుట్ చేసే సమయంలో మాస్క్ వేసుకోవాలా వద్దా ? )
అనసూయ భరద్వాజ్ అందాలు ఎవర్ Green
Follow us on twitter