Marburg Virus Symptoms: ఆఫ్రికాలోని ఈక్వటోరియల్ గినియాలో మార్బర్గ్ అనే కొత్త వైరస్ విధ్వంసం సృష్టిస్తోంది. ఈ వైరస్ సోకి ఇప్పటివరకు తొమ్మిది మంది మృత్యువాతపడినట్లు డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. భారీ సంఖ్యలో ప్రజలు అస్వస్థతకు గురయ్యారని వెల్లడించింది. మార్బర్గ్ వైరస్ లక్షణాలు ఎబోలా వైరస్ మాదిరిగానే ఉన్నాయని పేర్కొంది. ఈ వైరస్ చాలా వేగంగా వ్యాపిస్తోందని.. మరణాల శాతం 88 శాతం ఉన్నట్లు చెప్పింది. ఈ వైరస్ సోకిన వారిలో జ్వరం, ఛాతీ నొప్పి, తీవ్రమైన తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని తెలిపింది. పరిస్థితి విషమింస్తే రోగి మరణించే అవకాశం కూడా ఉంటుంది.
మార్బర్గ్ వైరస్‌కు ఇంత పెద్ద ఎత్తున సోకడం ఇదే మొదటిసారని డబ్ల్యూహెచ్‌ఓ ఓ ప్రకటన విడుదల చేసింది. వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు బృందాలను మోహరించారు. వైరస్ సోకిన వారిని గుర్తించి, వారికి వెంటనే చికిత్స అందిస్తున్నారు. ఈ వైరస్ వ్యాప్తిని నివారణకు ఆరోగ్య అత్యవసర నిపుణులు, ఇన్ఫెక్షన్ నివారణ బృందాలు, ల్యాబ్‌లు, కమ్యూనికేషన్ సపోర్ట్ సిస్టమ్‌లను మోహరించడం చూస్తుంటే.. వ్యాధి తీవ్రత ఎంత ప్రమాదకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
మార్బర్గ్ వైరస్ ఇన్ఫెక్షన్ వేగంగా వ్యాపిస్తుందని.. మరణాల రేటు 88 శాతానికి చేరుకోవచ్చని డబ్యూహెచ్ఓ ప్రాంతీయ డైరెక్టర్ డాక్టర్ మట్షిడిసో మోటి తెలిపారు. మార్బర్గ్ వైరస్ ఎబోలా వైరస్ కుటుంబానికి చెందినదని అన్నారు. రోగికి అధిక జ్వరం, తలనొప్పి ఉంటుందని.. చాలా మంది రోగులు సంక్రమణకు ఏడు రోజులలోపు రక్తస్రావ లక్షణాలు కూడా కనిపించవచ్చని అన్నారు.
ఈ వైరస్ గబ్బిలాల నుంచి మనుషులకు సోకుతుంది. ఇది సోకిన వక్తికి దగ్గరగా వెళ్లిన ఇతర వ్యక్తులకు కూడా వ్యాపిస్తుంది. ఇప్పటివరకు ఈ వైరస్‌కు చికిత్స లేదా వ్యాక్సిన్ అందుబాటులో లేదు. అయితే సకాలంలో చికిత్స అందించడం ద్వారా వ్యక్తి ప్రాణాలను కాపాడవచ్చని వైద్యులు చెబుతున్నారు.
Also Read: Jayamangala Venkataramana: మాజీ ఎమ్మెల్యేకు సీఎం జగన్ బంపర్ ఆఫర్.. టీడీపీకి షాక్..!
Also Read: Mutual FundS: టాప్ 10 మ్యూచువల్ ఫండ్స్.. ఇక్కడ పెట్టుబడి పెడితే మంచి లాభాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook