Mike Tyson Punches: విమానంలో పట్టరాని కోపంతో ఊగిపోయిన మైక్ టైసన్.. తోటి ప్రయాణికుడిని చితక్కొట్టాడు..

Video of Mike Tyson Punches Passenger: ఎంత చెప్పినా వినకుండా మైక్ టైసన్‌ను పదే పదే విసిగించాడో వ్యక్తి. ఇంకేముంది... టైసన్ పట్టరాని కోపంతో అతని ముఖాన్ని పచ్చడి చేశాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 22, 2022, 08:23 AM IST
  • మైక్ టైసన్‌ను విసిగించిన తోటి ప్రయాణికుడు
  • విమానంలోనే ఆ ప్రయాణికుడిని చితక్కొట్టిన టైసన్
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియో
 Mike Tyson Punches: విమానంలో పట్టరాని కోపంతో ఊగిపోయిన మైక్ టైసన్.. తోటి ప్రయాణికుడిని చితక్కొట్టాడు..

Video of Mike Tyson Punches Passenger: బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్‌కు పట్టరాని కోపమొచ్చింది. చెవిలో జోరీగ లాగా నస పెట్టడంతో తోటి ప్రయాణికుడిపై టైసన్ పిడి గుద్దులు కురిపించాడు. దెబ్బకు ఆ ప్రయాణికుడి నొసటి నుంచి రక్తం కారింది. టైసన్ ఈ స్థాయిలో విరుచుకుపడటం చాన్నాళ్ల తర్వాత ఇదే తొలిసారి అని అంటున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మైక్ టైసన్ (55) ఈ నెల 20న అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ఫ్లోరిడా వెళ్లేందుకు విమానం ఎక్కాడు. విమానంలో తన వెనకాల కూర్చొన్న ఓ ప్యాసింజర్ మైక్ టైసన్‌ను చూడగానే ఆశ్చర్యంతో అతనితో మాటలు కలిపాడు. టైసన్ కూడా నవ్వుతూనే అతనితో మాట్లాడాడు. అయితే సదరు ప్యాసింజర్ నాన్ స్టాప్‌గా మాట్లాడుతూనే ఉండటంతో... టైసన్ అభ్యంతరం చెప్పాడు.

తాను కాస్త అలసిపోయి ఉన్నానని... కాసేపు సైలెంట్‌గా ఉండాలని సదరు ప్యాసింజర్‌ను టైసన్ కోరాడు. అయినప్పటికీ అతను వినిపించుకోలేదు. టైసన్ వెనక సీట్లో కూర్చొన్న అతను చెవిలో జోరీగ లాగా నస పెట్టాడు. దీంతో టైసన్‌కు చిర్రెత్తుకొచ్చింది. సీట్లో నుంచి లేచి వెనక సీట్లో కూర్చొన్న ఆ ప్యాసింజర్‌పై పిడి గుద్దులు కురిపించాడు. దీంతో ఆ ప్యాసింజర్‌కు నొసటి భాగంలో రక్తం బయటకొచ్చింది. 

ఈ ఘటనపై మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్ కెల్విన్ గాస్టెలం ట్విట్టర్ ద్వారా స్పందించాడు. చాలా రోజులుగా మైక్ టైసన్ సైలెంట్‌గా తన పనేదో తనది అన్నట్లుగా ఉంటున్నాడని... విమానంలో తోటి ప్రయాణికుడు తాగి, టైసన్‌ను ఇబ్బంది పెట్టేలా ప్రవర్తించాడని అన్నారు. ఆ ప్రయాణికుడి ప్రవర్తన వల్లే టైసన్ విరుచుకుపడ్డాడని.. అనవసరంగా టైసన్‌ను తప్పుగా అర్థం చేసుకోవద్దని కోరాడు. 

 

Also Read: MS Dhoni: ధోనీ బ్రెయిన్ ఎంత షార్పో.. పొలార్డ్‌ను ఎలా కమ్మేశాడో చూడండి... వీడియో వైరల్..

Also Read: Horoscope Today April 22 2022: రాశి ఫలాలు.. ఆ రాశి వారిని తెలియని భయం కలవరపెడుతుంది

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News