800 Earthquakes: 14 గంటల్లో 800 భూకంపాలంటే నమ్మలేకున్నారా, ఎక్కడ , ఎప్పుడు జరిగింది

800 Earthquakes: ఇటీవలి కాలంలో వివిధ దేశాల్లో సంభవిస్తున్న భూకంపాల గురించి వింటుంటే భయం వేస్తోంది. భూమి కంపించిందంటే చాలు రోడ్లపై పరుగులెడుతున్నారు. మరి అలాంటిది 14 గంటల వ్యవధిలో 800 భూకంపాలు సంభవిస్తే ఎలా ఉంటుంది...అతిశయోక్తి కానేకాదు.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 13, 2023, 08:08 PM IST
800 Earthquakes: 14 గంటల్లో 800 భూకంపాలంటే నమ్మలేకున్నారా, ఎక్కడ , ఎప్పుడు జరిగింది

800 Earthquakes: ప్రపంచంలో కొన్ని దేశాలు భూకంపాలకు నిలయాలు. కొన్ని దేశాల్లో తీవ్రత ఎక్కువగా ఉండి తరచూ భూమి కంపిస్తుంటే మరి కొన్ని దేశాల్లో ఆ పరిస్థితి ఉండదు. ఇటీవల సంభవిస్తున్న భూకంపాలతో అందరూ ఆందోళన చెందుతున్నారు. అందుకే భూమి చిన్నగా కంపించినా చాలు బయటకు పరుగులెడుతున్నారు. ఈ క్రమంలో ఐస్‌లాండ్‌లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

భూమిలోని టెక్టానిక్ ప్లేట్ల కదలికలు, మార్పులు, భూమి పొరల్లో జరిగే సర్దుబాటు కారణంగా భూమి కంపిస్తుంటుంది. ఇది కొన్ని ప్రాంతాల్లో తీవ్రంగా ఉంటే ఇంకొన్ని ప్రాంతాల్లో సాధారణంగా ఉంటుంది. ఏదేమైనా భూకంపం అంటే చాలు భయపడే పరిస్థితి ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఐస్‌లాండ్‌లోని ఓ ప్రావిన్స్‌లో ఒకటి కాదు రెండు కాదు..పది కాదు. వంద కాదు..ఏకంగా 800 భూకంపాలు సంభవించాయి. అది కూడా కేవలం 14 గంటల వ్యవధిలో. ప్రపంచంలో పర్యాటకానికి ప్రసిద్ది చెందిన ఈ దేశంలో ఇంత భారీగా భూకంపాలు రావడంతో నవంబర్ 16 వరకూ మూసివేశారు. 

అట్లాంటిక్ సముద్ర ప్రంతంలోని రెక్టాన్స్ ద్వీపకల్ప ప్రాంతంలో 14 గంటల్లో 800 సార్లు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై ఈ భూకంపాల తీవ్రత 4గా నమోదైంది. భూకంప తీవ్రత 4 కావడంతో ఎలాంటి ఆస్థి, ప్రాణనష్టం సంభవించలేదు. అయితే కేవలం 14 గంటల్లో 800 సార్లు భూమి కంపించడటాన్ని సీరియస్‌గా పరిగణించాల్సి వస్తోంది. ఈ ప్రాంతంలో అగ్ని పర్వతాలు కూడా చాలా ఎక్కువ. లావా, శంకువులు ఇక్కడున్నాయి. 

ఇక్కడ తరచూ అగ్నిపర్వతాలు బద్దలౌతుంటాయి. భూకంపాలు సంభవించిన తరువాత అగ్ని పర్వతాలు విస్ఫోటనం చెందుతుంటాయి. భూ ప్రకంపనలు చోటుచేసుకున్న ప్రాంతంలో 4వేలకు పైగా ఇళ్లున్నాయి. రెక్టాన్స్ ద్వీపకల్పం పరిధిలోనే బ్లూ లగూన్ ఉంది. ఈ ప్రాంతం మనిషి సృష్టించిన ఓ రకమైన భూ ఉష్ణ ఖనిజ ప్రాంతం. పూర్తిగా నీలిరంగులో ఉండే మడుగు ఇది.

Also read: Tiktok Ban: చైనాకు నేపాల్ షాక్.. టిక్‌టాక్ యాప్‌పై బ్యాన్.. ఎందుకంటే..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News