Kili Paul Attack: ఇంటర్నెట్ సంచలనం కిలి పాల్‌పై దుండగుల దాడి.. కత్తితో పొడిచి, కర్రలతో కొట్టి..!

Tanzanian internet sensation Kili Paul attack. టాంజానియా కుర్రాడు, ఇంటర్నెట్ సంచలనం కిలి పాల్‌పై గుర్తుతెలియని దుండగులు దాడి చేశారు. ఐదుగురు గుర్తు తెలియని వ్యక్తులు పాల్‌పై కత్తితో దాడి చేశారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 1, 2022, 11:15 PM IST
  • కిలి పాల్‌పై దుండగుల దాడి
  • కత్తితో పొడిచి, కర్రలతో కొట్టి
  • చికిత్స పొందుతున్న కిలి పాల్‌
Kili Paul Attack: ఇంటర్నెట్ సంచలనం కిలి పాల్‌పై దుండగుల దాడి.. కత్తితో పొడిచి, కర్రలతో కొట్టి..!

Kili Paul attacked by 5 unidentified individuals with a knife: టాంజానియా కుర్రాడు, ఇంటర్నెట్ సంచలనం కిలి పాల్‌పై గుర్తుతెలియని దుండగులు దాడి చేశారు. ఐదుగురు గుర్తు తెలియని వ్యక్తులు పాల్‌పై కత్తితో దాడి చేయడమే కాకుండా.. కర్రలతో కూడా కొట్టారు. దాంతో టాంజానియా కుర్రాడికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతడికి ఐదు కుట్లు కూడా పడ్డాయి. ఈ విషయాన్ని కిలి పాల్‌ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. 

తనపై దాడికి సంబంధించి వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు తన యూట్యూబ్‌ ఛానల్లో కిలి పాల్‌ షేర్‌ చేశాడు. ఆ వీడియోలో స్ట్రెచర్‌పై పడుకొని ఉన్న కిలి పాల్‌ చేయి, కాలుకి తీవ్రంగా గాయాలు అయ్యాయి. మరోవైపు స్ట్రెచర్‌పై పడుకున్న ఓ ఫోటో పోస్ట్ చేసి.. 'ప్రజలు నన్ను కిందకి దించాలని కోరుకుంటారు కానీ దేవుడు నన్ను ఎప్పుడూ పైకి తీసుకువెళతాడు. నా కోసం ప్రార్ధించు' అని రాసుకొచ్చాడు. ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అయింది. అయితే తనపై దాడి ఎప్పుడు జరిగిందనే వివరాలు మాత్రం చెప్పలేదు.  

కిలి పాల్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో మరో పోస్ట్ కూడా చేశాడు. 'ఐదుగురు దుండగులు నాపై తీవ్రంగా దాడి చేశారు. కత్తితో దాడి చేయడమే కాకుండా.. కర్రలతో కూడా కొట్టారు. దాడిని ప్రతిఘటించడంతో దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. దేవుడి దయవల్ల ప్రాణాలతో బయటపడ్డాను. నా బొటన వేలుకి ఐదు కుట్లు పడ్డాయి. ప్రస్తుతం నేను బాగానే ఉన్నాను. నాకోసం ఆ దేవుడిని ప్రార్థించండి' అని కిలి పాల్‌ పేర్కొన్నాడు.  

టాంజానియాకు చెందిన కిలి పాల్‌ ఇటీవల ఇంటర్నెట్ సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ముఖ్యంగా భారతీయ భాషల్లోని వివిధ పాటలను అనుకరిస్తూ.. డ్యాన్సులు చేయడంతో పాపులర్ అయ్యాడు. తెలుగు పాటలకు డాన్స్ చేసి అందరినీ అలరించాడు. ఈ క్రమంలో కిలి పాల్‌ను టాంజానియాలోని భారతీయ హైకమిషనర్‌ ప్రత్యేకంగా అభినందించారు. పీఎం నరేంద్ర మోదీ కూడా కిలి పాల్‌ ప్రతిభను ప్రశంసించారు.  

Also Read: Praja Sangrama Yatra: టీఆర్ఎస్ నేతలారా.. మీ ప్రభుత్వం ఉండేది కొద్దిరోజులే: బండి సంజయ్‌

Also Read: Shraddha Das Hot Pics: చీర కట్టులోనూ.. నడుమందాలతో హీటెక్కిస్తున్న శ్రద్ధా దాస్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News