Afghanistan: ఆఫ్ఘన్‌పై తాలిబన్ల ఆధిపత్యం, త్వరలోనే అధికారిక ప్రకటన

Afghanistan: ఆఫ్ఘనిస్తాన్ మరోసారి తాలిబన్ల వశం కానుంది. ఇప్పటికే కాబూల్ మినహా మిగిలిన ప్రాంతాన్ని తాలిబన్లు వశపర్చుకున్నారు. త్వరలో ఆఫ్ఘనిస్తాన్ ఆధిపత్యంపై తాలిబన్ల నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 15, 2021, 02:01 PM IST
Afghanistan: ఆఫ్ఘన్‌పై తాలిబన్ల ఆధిపత్యం, త్వరలోనే అధికారిక ప్రకటన

Afghanistan: ఆఫ్ఘనిస్తాన్ మరోసారి తాలిబన్ల వశం కానుంది. ఇప్పటికే కాబూల్ మినహా మిగిలిన ప్రాంతాన్ని తాలిబన్లు వశపర్చుకున్నారు. త్వరలో ఆఫ్ఘనిస్తాన్ ఆధిపత్యంపై తాలిబన్ల నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి.

ఆప్ఘన్ పోరు(Afghan War) అంతిమదశకు చేరుకుంది. ఆఫ్ఘన్ బలగాలకు, తాలిబన్లకు మధ్య జరుగుతున్న యుద్ధంలో తాలిబన్లు పూర్తి ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. తాలిబన్లు దూసుకొస్తుండటంతో ఆప్ఘన్ బలగాలకు ఏం చేయాలో తోచడం లేదు. ఇప్పటికే కాబూల్ మినహాయించి మిగిలిన నగరాలు, పట్టణాల్లో తాలిబన్లు చొచ్చుకొచ్చారు. మజర్ ఎ షరీఫ్ కూడా తాలిబన్ల హస్తగతమైంది. తరువాత జలాలాబాద్ స్వాధీనం చేసుకన్నారు. ఆప్ఘనిస్తాన్‌లోని 34 ప్రావిన్స్‌లలో 26 ఇప్పటికే తాలిబన్ల వశమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే ఆఫ్గన్ సైన్యం నుంచి ఏ విధమైన ప్రతిఘటన లేకుండానే తాలిబన్లు విజయం సాధించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కాబూల్‌కు కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నారని సమచారం. తాలిబన్ల (Talibans)ఆక్రమణ దాదాపుగా పూర్తయినట్టేనని విశ్లేషకులు భావిస్తున్నారు. 

తాలిబన్ల ఆక్రమణతో(Talibans Attack) అమెరికా అప్రమత్తమైంది. కాబూల్‌(Kabul)లోని రాయబార కార్యాలయ సిబ్బంది, సాధారణ పౌరుల్ని తరలించేందుకు సైన్యాన్ని రంగంలో దించాలని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ (Joe Biden)ఇప్పటికే ఆదేశించారు. మరికొన్ని గంటల్లో ఆఫ్ఘన్ ఆధిపత్యంపై తాలిబన్ల నుంచి అధికారిక ప్రకటన కూడా రావచ్చనేది ఓ అంచనా. గతంలో అంటే 1994 ఆప్ఘన్ అంతర్యుద్ధంలో బలంగా మారిన తాలిబన్లు 1996 నుంచి 2001 వరకూ మిలిటరీ ఆర్గనైజేషన్‌గా ప్రకటించుకున్నాయి. 9/11 దాడుల అనంతరం అమెరికా నేతృత్వంలోని విదేశీ సైన్యం తాలిబన్లను అణచివేసి..ఇటీవలే సైన్యాన్ని ఉపసంహరించుకున్నాయి. దాంతో మరోసారి తాలిబన్లు ఆప్ఘన్‌ను వశపర్చుకున్నారు. 

Also read: Haiti Earthquake: హైతీలో భారీ భూకంపం, 3 వందలకు పైగా మరణాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News