Taliban Effect: తాలిబన్ల రాకతో ఆప్ఘన్ ముఖచిత్రం మారింది. ఆ దేశపు గత పాలకులు స్వీయ రక్షణ కోసం దేశం వదిలేశారు. మరి పోషణ ఎలా..క్యాబ్ డ్రైవర్‌గా బతుకీడుస్తున్నారు. సామాన్యులనుకుంటున్నారా..కానేకాదు ఏకంగా నాటి ఆర్థిక మంత్రి పరిస్థితి ఇది.
ఆఫ్ఘనిస్తాన్‌లో తిరిగి తాలిబన్ల రాజ్యం ఏర్పడిన తరువాత..పరిస్థితులు మారుతున్నాయి. ముఖ్యంగా తాలిబన్లు దేశంలో అడుగుపెట్టగానే చాలామంది గత పాలకులు దేశం వదిలి వెళ్లిపోయారు. యూఎస్, ఫ్రాన్స్, జర్మనీ, ఇంగ్లండ్ తదితర దేశాలకు వెళ్లి తలదాచుకుంటున్న పరిస్థితి. ఈ క్రమంలో నాటి ఆఫ్ఘన్ ప్రభుత్వంలో ఆర్ధికమంత్రిగా పనిచేసిన ఖలీద్ పాయెందా దేశం వదిలి అమెరికా వెళ్లిపోయారు.
దేశం కాని దేశం..కుటుంబాన్ని పోషించుకునేందుకు ఏదో ఒకటి చేయాలి కదా. అందుకే చేసేది లేక కుటుంబ పోషణ కోసం అమెరికాలో క్యాబ్ డ్రైవర్‌గా జీవితం ప్రారంభించారు. ఒకప్పటి ఆర్ధిక మంత్రి..అదే ఆర్ధిక పరిస్థితుల కోసం ఇప్పుడు డ్రైవర్‌గా పనిచేయడం. విధి రాతనుకోవాలా..లేదా నిజాయితీగా ఉన్నారనుకోవాలా. ఓ వైపు క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తూనే..జార్జ్‌టౌన్ యూనివర్శిటీలో ప్రొఫెసర్‌గా కూడా పనిచేస్తున్నారు ఖలీద్. క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నందుకు గొప్పగా ఫీలవుతున్నట్టు తెలిపారు. కుటుంబాన్ని పోషించుకునేందుకు, రక్షించుకునేందుకు పడిన కష్టాన్ని గుర్తు చేసుకున్నారు. కుటుంబంతో కలిసి జీవిస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. అదే సమయంలో నాటి ఆప్ఘన్ పరిస్థితుల్ని జ్ఞప్తికి తెచ్చుకున్నారు.
ఇక్కడ ఉండటానికి చోటు లేదు..ఇక్కడి వాడిని కాదు..అక్కడి వాడిని కాదు. ఒక్కోసారి శూన్యంగా అన్పిస్తుంటుంది అంటూ ఆవేదన చెందారు ఖలీద్. ఈ విషయంలో ఎవరినీ నిందించలేనని చెప్పారు. అమెరికా ఆప్ఘన్లకు చోటు కల్పించనప్పుడు, ఆఫ్ఘనిస్తాన్ తమ దేశస్థుల్ని అక్కున చేర్చుకోనప్పుడు ఎవరి పరిస్థితైనా ఇలానే ఉంటుందన్నారు. ఆఫ్ఘన్‌లో అధికారాన్ని తాలిబన్లు చేజిక్కించుకున్నప్పుడు..అమెరికానే బాథ్యత వహించాలన్నారు. 9/11 దాడుల అనంతరం ఆఫ్ఘనిస్తాన్‌ను కేంద్రబిందువుగా మార్చేసిన అమెరికా..ప్రజాస్వామ్యానికి, మానవ హక్కుల నిబద్ధతకు ద్రోహం చేసిందన్నారు.
Also read: Banks Privatization: ఆ రెండు బ్యాంకుల ప్రైవేటీకరణ త్వరలోనే, కేంద్రం కీలక చర్యలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Taliban Effect: ఆర్ధిక పరిస్థితులతో డ్రైవర్‌గా మారిన ఆర్ధిక మంత్రి, ఎక్కడ