Imran Khan on India: భారత్‌పై..ఎన్డీయే ప్రభుత్వ విధానాలపై పాక్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్ ప్రశంసలు

Imran Khan on India: ఇండియా అంటేనే అంతెత్తున విరుచుకుపడే పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వైఖరిలో ఒకేసారి మార్పు వచ్చింది. నోటి వెంట విమర్శలకు బదులు..ప్రశంసలు వస్తున్నాయి. ఇండియాను భేష్ అంటున్నారు.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 21, 2022, 08:25 AM IST
Imran Khan on India: భారత్‌పై..ఎన్డీయే ప్రభుత్వ విధానాలపై పాక్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్ ప్రశంసలు

Imran Khan on India: ఇండియా అంటేనే అంతెత్తున విరుచుకుపడే పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వైఖరిలో ఒకేసారి మార్పు వచ్చింది. నోటి వెంట విమర్శలకు బదులు..ప్రశంసలు వస్తున్నాయి. ఇండియాను భేష్ అంటున్నారు.

కారణాలేంటనేది ఇంకా తెలియదు కానీ..పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వైఖరిలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. ఇండియా అంటే ఎప్పుడూ విమర్శలు కురిపించే ఇమ్రాన్ నోటి నుంచి ఇండియాపై ప్రశంసలు వస్తున్నాయి. ఒక్కసారిగా మారిన ఇమ్రాన్ ఖాన్ వైఖరి ఆశ్చర్యం కల్గిస్తోంది. అసలేం జరిగిందంటే..

పాకిస్తాన్ పార్లమెంట్‌లో ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై అక్కడి ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా..ఈ నెల 25న పార్లమెంట్ సమావేశం ఉంటుందని స్పీకర్ ప్రకటించారు. ఇమ్రాన్ ఖాన్‌కు పదవీగండం ఉంటుందనే ప్రచారం ముమ్మరంగా సాగుతున్న నేపధ్యంలో..ప్రజల మద్దతు కోసం ఇమ్రాన్ ఖాన్ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఖైబర్ పఖ్తూన్ ఖ్వా ప్రావిన్సులో జరిగిన ఓ ర్యాలీలో ప్రసంగం సందర్భంగా..ఇండియాపై..నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. ఇదే ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. 

ఇమ్రాన్ ఖాన్ ఏమన్నారంటే

స్వతంత్ర విదేశీ విధానం అనుసరిస్తున్నందుకు మన పొరుగు దేశం భారత్‌ను  అభినందిస్తున్నాను. క్వాడ్‌ కూటమిలో భాగస్వామిగా ఉన్న భారత్‌ ఒకవైపు అమెరికా వద్దంటున్నా రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంది. మా ప్రభుత్వ విదేశీ విధానం కూడా పాక్‌ ప్రజల ప్రయోజనాలకే పెద్దపీట వేస్తుంది. నేనెవరికీ తల వంచను. నా దేశాన్ని కూడా వంచనివ్వను. రష్యా నుంచి ముడిచమురు దిగుమతితో స్వతంత్ర విదేశీ విధానాన్ని ఇండియా అనుసరించింది. ఈ విషయంలో ఇండియా నిర్ణయం భేష్.ఎన్డీయే ప్రభుత్వ విధానాలు చాలా బాగున్నాయి. 

వాస్తవానికి విదేశీ వ్యవహారాలకు సంబంధించిన అంశాలు బహిరంగ ర్యాలీల్లో చర్చించకూడదనేది పాకిస్తాన్ సంప్రదాయం. ఇందుకు భిన్నంగా వ్యవహరించారు ఇమ్రాన్ ఖాన్. రష్యా ఉక్రెయిన్ యుద్ధం విషయంలో ఏం జరిగిందో చెప్పారు. రష్యాకు వ్యతిరేకంగా పాకిస్తాన్ మద్దతు కోరిన ఈయూ ప్రతినిధులు మాటల్ని బేఖాతరు చేశామన్నారు. అసలు ఈయూ మాట వినడం ద్వారా పాకిస్తాన్ కు కలిగే ప్రయోజనం ఏదీ లేదన్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అమెరికా జరిపిన పోరాటంలో పాకిస్తాన్ భాగస్వామి కావడం, 80 వేలమంది ప్రజల్ని పోగొట్టుకోవడాన్ని వివరించారు. 

Also read: AP Politics: ప్రభుత్వ వ్యతిరేక ఓటు సంఘటితమయ్యేనా, మారుతున్న రాజకీయ పరిణామాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News