Starliner: కీలక అంతరిక్ష ప్రయోగం నిలిపివేత.. సునీతా విలియమ్స్‌ రికార్డుకు బ్రేక్‌

Starliner Launch Postponed Due To Oxygen Relief Valve At The Last Stage: మానవ సహిత అంతరిక్ష ప్రయోగానికి మరో బ్రేక్‌ పడింది. స్టార్‌ లైనర్‌ ప్రయోగం అనివార్య కారణాలతో ఆగిపోగా సునీత విలియమ్స్‌ నిరాశకు లోనయ్యారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : May 7, 2024, 01:28 PM IST
Starliner: కీలక అంతరిక్ష ప్రయోగం నిలిపివేత.. సునీతా విలియమ్స్‌ రికార్డుకు బ్రేక్‌

Atlas V Starliner: ముచ్చటగా మూడోసారి అంతరిక్ష ప్రయాణానికి సిద్ధం కాగా సునీతా విలియమ్స్‌కు బ్రేక్‌ పడింది. చేయాల్సిన ప్రయోగం సాంకేతిక కారణాలతో వాయిదా పడింది. దీంతో ఆమె నిరాశకు గురయ్యింది. బోయింగ్‌ స్టార్‌లైనర్‌ ప్రయోగాన్ని చివరి నిమిషంలో నిలిపివేశారు. అట్లాస్‌ వి రాకెట్‌లోని రెండో దశలో ఉండే ఆక్సిజన్‌ వాల్వ్‌ లీక్‌ కావడంతో ప్రయోగాన్ని ఆపేశారు.

Also Read: White House: అమెరికా అధ్యక్ష నివాసం వద్ద కలకలం.. గేటును ఢీకొట్టిన కారు వ్యక్తి మృతి

భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 8.04 గంటలకు అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న కేప్‌ కెనవరాల్‌ లాంచింగ్‌ స్టేషన్‌ నుంచి ఈ ప్రయోగం జరగాల్సి ఉంది. స్టేషన్‌ నుంచి స్టార్‌ లైనర్‌ వోమ్యనౌక నింగిలోకి వెళ్లాల్సి ఉంది. కానీ ప్రయోగానికి రెండు గంటల ముందే సాంకేతిక సమస్యను గుర్తించి ప్రయోగాన్ని నిలిపివేశారు. ఆక్సిజన్‌ వాల్వ్‌ లీక్‌తో ప్రయోగాన్ని నిలిపివేస్తున్నట్లు బోయింగ్‌ సంస్థ ప్రకటించింది. మళ్లీ ఎప్పుడు ప్రయోగం ఉంటుందని త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించింది. ఈ ప్రయోగంలో సునీతా విలియమ్స్‌తోపాటు మరో వోమ్యగామి బారీ విల్మోర్‌ అంతరిక్షంలోకి వెళ్లాల్సి ఉంది. కానీ ప్రయోగం ఆగిపోవడంతో వారు నిరాశకు గురయ్యారు.

Also Read: GPS Jamming: స్తంభించిన జీపీఎస్‌.. విమానాలకు అంతరాయంతో ప్రపంచ దేశాల్లో కలకలం

కాగా భారత సంతతికి చెందిన సునీత విలిమయ్స్‌ మూడోసారి అంతరిక్షంలోకి వెళ్లి రికార్డు నెలకొల్పాలని భావించారు. ప్రయోగం నిలిపివేయడంతో ఆమె ఆశ తీరలేదు. అంతరిక్షంలో 322 రోజులు సునీత విలియమ్స్‌ గడిపారు. అత్యధిక సమయం అంతరిక్షయానం చేసిన మహిళా వ్యోమగామిగా సునీత గుర్తింపు సాధించారు. ఆమె మొదటిసారి 9 డిసెంబర్‌ 2006లో అంతరిక్ష ప్రయాణం చేశారు. 22 జూన్‌ 2007న భూమి మీదకు తిరిగి వచ్చారు. రెండోసారి 14 జూలై 2012- 18 నవంబర్‌ 2012 వరకు అంతరిక్షంలో ఉన్నారు. తాజా ప్రయోగంతో అంతరిక్షంలో కొన్నాళ్లు ఉండి రావాల్సి ఉంది. కానీ ప్రయోగం వాయిదాతో సునీత మరోసారి వెళ్తారా లేదా అనేది అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News