Breath Test: నిమిషం వ్యవధిలోనే కరోనా ఉందో లేదో తేలిపోతుందిక

Breath Test: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ నిర్ధారణ పరీక్షలు కీలకంగా మారాయి. ఇప్పటికి అందుబాటులో ఉన్న పరీక్షా విధానాలు కాకుండా కొత్త విధానం వస్తోంది. కేవలం నిమిషం వ్యవధిలో ఫలితం తేల్చే ప్రక్రియకు సింగపూర్ ఓకే చెప్పింది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 25, 2021, 01:21 PM IST
Breath Test: నిమిషం వ్యవధిలోనే కరోనా ఉందో లేదో తేలిపోతుందిక

Breath Test: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ నిర్ధారణ పరీక్షలు కీలకంగా మారాయి. ఇప్పటికి అందుబాటులో ఉన్న పరీక్షా విధానాలు కాకుండా కొత్త విధానం వస్తోంది. కేవలం నిమిషం వ్యవధిలో ఫలితం తేల్చే ప్రక్రియకు సింగపూర్ ఓకే చెప్పింది.

కరోనా పాజిటివా, నెగెటివా అనేది ఎంత త్వరగా తేలితే చికిత్స అంత త్వరగా ప్రారంభమవుతుంది. కోవిడ్ నిర్ధారణ పరీక్షల(Covid19 Tests) ఆధారంగానే కరోనా మహమ్మారి నియంత్రణ సాధ్యమవుతుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న యాంటీజెన్, ఆర్టీపీసీఆర్ టెస్టులకు కాస్త సమయం పడుతుంది.యాంటీజెన్ టెస్టులకైతే కిట్ల కొరత ఉంటోంది. ఈ నేపధ్యంలో అత్యంత వేగంగా కేవలం నిమిషం వ్యవధిలో కరోనా పాజిటివా లేదా నెగెటివా అనేది తేల్చే కొత్త విధానం అందుబాటులో వస్తోంది. అదే బ్రీథలైజర్ పరీక్ష. 

నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ సింగపూర్‌కు చెందిన ముగ్గురు గ్రాడ్యుయేట్లు డాక్టర్ జియా జునాన్, డూ ఫాంగ్, వానే వీతో పాటు ఇండియన్ సంతతికి చెందిన ప్రొఫెసర్ వెంకటేశన్ కలిసి సంయుక్తంగా ఈ సరికొత్త విధానాన్ని అభివృద్ధి చేశారు. అందరూ కలిసి బ్రీథోనిక్స్ అనే కంపెనీ స్థాపించి..బ్రీథలైజర్ టెస్టును రూపొందించారు. అంటే శ్వాస ఆధారంగా కరోనా సోకిందా లేదా అనేది కేవలం నిమిషం వ్యవధిలే తేల్చేస్తుంది. దీనిని బ్రెఫెన్స్ గో కోవిడ్ 19 బ్రీత్ టెస్ట్ సిస్టమ్‌గా( Covid Breath Test) పిలుస్తున్నారు. ఈ ప్రక్రియకు సింగపూర్ (Singapore)అధికార యంత్రాంగం తాత్కాలిక అనుమతి మంజూరు చేసింది. ఈ తరహా విధానాన్ని అనుమతించడం ఇదే తొలిసారి. ఇకపై విదేశాల్నించి సింగపూర్‌కు వచ్చేవారికి బ్రీథలైజర్ టెస్టులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

Also read: US, UK on Covaxin: కోవాక్సిన్ తీసుకున్న వాళ్లకు షాక్ ఇచ్చిన అమెరికా, బ్రిటన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News