Russia vaccine: మూడో దశ ప్రయోగాలకు సిద్ధం

కరోనా వ్యాక్సిన్ ( Corona vaccine race ) రేసులో ముందు వరుసలో ఉన్న రష్యా ఇప్పుడు మూడో దశ ప్రయోగాలకు సిద్ధమౌతోంది. వ్యాక్సిన్ పై సర్వత్రా నెలకొన్న అభ్యంతరాల నేపధ్యంలో రష్యా ( Russia ) ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 

Last Updated : Aug 20, 2020, 10:26 PM IST
Russia vaccine: మూడో దశ ప్రయోగాలకు సిద్ధం

కరోనా వ్యాక్సిన్ ( Corona vaccine race ) రేసులో ముందు వరుసలో ఉన్న రష్యా ఇప్పుడు మూడో దశ ప్రయోగాలకు సిద్ధమౌతోంది. వ్యాక్సిన్ పై సర్వత్రా నెలకొన్న అభ్యంతరాల నేపధ్యంలో రష్యా ( Russia ) ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 

కరోనా వైరస్ ( Corona virus ) ప్రభావంతో యావత్ ప్రపంచం ఇబ్బందుల్లో ఉంది. వివిధ దేశాలు వ్యాక్సిన్ ప్రయోగాల్లో నిమగ్నమై ఉండగా..రష్యా మాత్రం వ్యాక్సిన్ ( Russia vaccine ) కనుగొన్నామని...పేరు స్పుత్నిక్ వి ( Sputnik v ) అని ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపర్చింది. వ్యాక్సిన్ వివరాలను మీడియాకు వెల్లడించలేదు. రష్యా కేవలం రెండు దశల పరీక్షలే చేసిందని..మూడో దశ నిర్వహించలేదని  కొన్ని దేశాలు ఆరోపించాయి.

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్నంచి వస్తున్న ఒత్తిడితో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ ( World health organisation ) సైతం అభ్యంతరం తెలిపింది. రష్యా వ్యాక్సిన్ పై సమగ్ర సమాచారం లేదని చెప్పింది. దాంతో రష్యా తన వ్యాక్సిన్ కు సంబంధించి మూడో దశ ప్రయోగాల్ని ( Third phase trials ) ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. మూడో దశలో ఏకంగా 40 వేల మంది వాలంటీర్లపై వ్యాక్సిన్ ను ప్రయోగించనున్నట్టు ఆ దేశానికి చెందిన టీఏఎస్ఎస్ న్యూస్ ఏజెన్సీ ( TASS news agency ) వెల్లడించింది. Also read: Fact Check: పుతిన్ కూతురు వ్యాక్సిన్ వికటించి చనిపోయిందా ? ఈ వార్తలో నిజమెంత

Trending News