Russia: చంద్రయాన్​-3కి పోటీగా 'లూనా​ 25'.. 47 ఏళ్ల తర్వాత జాబిల్లిపైకి దూసుకెళ్లిన రష్యా రాకెట్..

Russia: దాదాపు 50 ఏళ్ల తర్వాత జాబిల్లిపైకి 'లునా-25' పేరుతో రాకెట్‌ను ప్రయోగించింది రష్యా. ఈ రాకెట్ శుక్రవారం వేకువజామున 2.10 గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 11, 2023, 10:12 AM IST
Russia: చంద్రయాన్​-3కి పోటీగా 'లూనా​ 25'.. 47 ఏళ్ల తర్వాత జాబిల్లిపైకి దూసుకెళ్లిన రష్యా రాకెట్..

Luna 25 launch: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రుడిపైకి చంద్రయాన్‌-3ని (Chandrayaan-3) పంపినట్టుగానే.. రష్యా కూడా ‘'లూనా-25' (Luna 25) అనే స్పేస్‌క్రాఫ్ట్‌ను శుక్రవారం ప్రయోగించింది. దాదాపు 47 ఏళ్ల తర్వాత చంద్రుడిపైకి రాకెట్ ను పంపింది రష్యా. మాస్కోకు తూర్పున 3,450 మైళ్ల దూరంలోని వోస్తోక్నీ కాస్మోడ్రోమ్‌ ప్రాంతం నుంచి శుక్రవారం తెల్లవారుజామున 2.10 గంటలకు '‘లునా - 25'’ నింగిలోకి దూసుకెళ్లింది. 

ఇది కేవలం ఐదు రోజుల్లోనే చంద్రుడి కక్ష్యలోకి చేరనుంది. అనంతరం మరో 3 లేదా ఏడు రోజుల్లో మూన్ యెుక్క దక్షిణ ధ్రువంలో ల్యాండర్ ను దిగేలా ఈ ప్రయోగం చేపట్టింది ఆ దేశ అంతరిక్ష పరిశోధనా సంస్థ రోస్‌కాస్మోస్‌. 1976 తర్వాత రష్యా చేపట్టిన తొలి లూనార్‌ ల్యాండర్‌ ప్రయోగం ఇదే కావడం విశేషం. తన చివరి లునార్ మిషన్ లో చంద్రుడిపై ఉన్న 6.2 ఔన్సుల (170గ్రాములు) మట్టి శాంపిళ్లను భూమికి తీసుకురాగలిగింది రష్యా.

రష్యా తాజాగా ప్రయోగం 'చంద్రయాన్-3'కు పోటీనిస్తోంది. చంద్రయాన్-3 చంద్రుడి దక్షిణ ధ్రువంపై ఆగస్టు 23న ల్యాండ్ కానుండగా.. అంతకంటే ముందే రష్యా పంపిన లూనా-25 అక్కడే అడుగుపెట్టనున్నట్లు సమాచారం. ఇది కేవలం ల్యాండర్ మిషన్ మాత్రమే. ఇది కేవలం 30 కేజీల పేలోడ్‌ను మోసుకెళ్తోంది. ఇందులో చంద్రుడిపై మట్టి ఆనవాళ్లను సేకరించేందుకు అవసరమయ్యే రోబోటిక్‌ చేతులు, డ్రిల్లింగ్‌ హార్డ్‌వేర్‌తో పాటు ఇతర శాస్త్రీయ పరికరాలు ఉన్నాయి. చంద్రుడి సౌత్​ పోల్​ ప్రాంతంలో సేఫ్ ల్యాండింగ్ తర్వాత ఈ మిషన్​ ఏడాది కాలం పాటు జాబిల్లి ఉపరితలంపై పరిశోధనలు చేస్తుంది.అంతరిక్ష పరిశోధనలో రష్యా సత్తా చాటేందుకు ఈ ప్రయోగం చేపట్టామని రష్యా స్పేస్‌ ఏజెన్సీ (రోస్‌కాస్మోస్‌) ఓ ప్రకటనలో తెలిపింది.

నిజానికి ఈ 'లూనా-25' ప్రయోగం దాదాపు రెండేళ్లపాటు ఆలస్యమైంది. దీనికి రష్యా-ఉక్రెయిన్ యుద్దమై కారణం. యూరోపియన్​ స్పేస్​ ఏజెన్సీ, ఇతర అంతర్జాతీయ సంస్థల సహకారం అందకపోవడంతో ఈ మిషన్ ను రష్యా ఆపేసింది.  చంద్రుడి దక్షిణ ధ్రువంపై ‘సాఫ్ట్ ల్యాండింగ్ చేసి చరిత్ర సృష్టించాలని ఇస్రో భావిస్తుంది. అందుకు అనుగుణంగానే గత నెల 14న చంద్రయాన్-3ను ప్రయోగించింది. ఇది ఈ నెల 23న చంద్రుడిపై ల్యాండ్ అవ్వనుంది. 

Also Read: నటుడు ప్రకాష్ రాజ్ సందర్శించిన కాలేజీని గోమూత్రంతో శుద్ధి చేసిన విద్యార్థులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News