Pakistani Model Photoshoot: కొవిడ్ మహమ్మారి కారణంగ ఏడాది కాలంగా కర్తార్ పూర్ పవిత్ర క్షేత్రం సందర్శనకు పాకిస్థాన్ ప్రభుత్వం యాత్రికులను అనుమతించలేదు. అయితే కరోనా రెండు డోసులు తీసుకున్న సందర్శకులు ఈ క్షేత్రాన్ని దర్శించుకునేందుకు ఇటీవలే అనుమతించింది. సిక్కు మత వ్యవస్థాపకులు, గురువు గురునానక్ 482వ వర్ధంతి సందర్భంగా ఈ యాత్రను ప్రారంభించింది పాక్ ప్రభుత్వం.
అయితే ఇటీవలే కర్తార్ పూర్ లోని దర్బాస్ సాహిబ్ గురుద్వారాలో జరిగిన ఓ సంఘటన ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. సిక్కులు పవిత్ర స్థలంగా భావించే ఆ గురుద్వారా ప్రాంగణంలో పాకిస్తాన్ కు చెందిన ఓ మోడల్ ఫొటోషూట్ చేసింది. ఇప్పుడా ఫొటోషూట్ ఆమెను వివాదంలోకి నెట్టింది. గురుద్వారాలో నుదిటి భాగం కనిపించకుండా తలపై వస్త్రాన్ని కప్పుకోవడం తప్పనిసరి. కానీ, ఆమె వస్త్రం కప్పుకోకుండా ఫొటోలు దిగడంతో సిక్కు వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ వివాదంపై స్పందించిన పాకిస్తాన్.. ఈ ఘటనపై విచారణ చేపడతామని హామీ ఇచ్చింది.
పాకిస్తాన్ లోని లాహోర్కి చెందిన మోడల్ సౌలేహ ఇంతియాజ్ కర్తార్‌పూర్ గురుద్వారా ప్రాంగణంలో సోమవారం ఫొటోలు దిగగా.. ఆమె ఫొటోలను మన్నత్ క్లాతింగ్ అనే వస్త్రవ్యాపార సంస్థ సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది. అయితే, ఆమె తలపై వస్త్రం ధరించకుండా ఫొటోలు దిగడం వివాదాస్పదంగా మారింది. సిక్కుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తించారంటూ ఆమెపై నెటిజన్లు మండిపడుతున్నారు. శిరోమణి అకాలీదల్ ప్రతినిధి మంజిందర్ సింగ్ సిర్సా కూడా ఆమె ఫొటోలను షేర్ చేసి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రవర్తన ఆమోదయోగ్యం కాదని, ఆమెపై వెంటనే చర్యలు తీసుకోవాలని పాక్ ప్రభుత్వాన్ని కోరారు.
Punjab Police are investigating all aspects related to this incident and strict legal action will be taken against responsible. Management of concerned brand & model are being investigated. Worship places of all religions are equally respectable.@MashwaniAzhar https://t.co/HLqwRKmOKY
— Punjab Police Official (@OfficialDPRPP) November 29, 2021
క్షమాపణలు చెప్పిన పాక్ మోడల్
గురుద్వారా ప్రాంగణంలో ఫొటోషూట్ వివాదాస్పదం కావడం వల్ల మోడల్ సౌలేహ ఇంతియాజ్ క్షమాపణ చెప్పారు. ఎవరినీ బాధపెట్టాలని ఇలా చేయలేదని, కర్తార్‌పూర్ గురుద్వారాను సందర్శించిన సందర్భంగా ఫొటోలు తీసుకున్నట్లు చెప్పారు. ఇలాంటి పనులు భవిష్యత్తులో చేయబోనన్నారు. ఆ ఫొటోలు పోస్ట్ చేసిన మన్నత్ క్లాతింగ్ సంస్థ కూడా క్షమాపణలు తెలిపింది. అది తాము నిర్వహించిన ఫొటోషూట్ కాదని, థర్డ్‌పార్టీ నుంచి వచ్చిన ఫొటోలను పోస్టు చేసినట్లు పేర్కొంది.
ఈ వివాదంపై పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ ప్రభుత్వం స్పందించింది. వెంటనే ఈ ఘటనపై విచారణ జరపాలని పోలీసులను ఆదేశించింది. దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. ఈ వివాదానికి సంబంధించి పూర్తి నివేదికను సమర్పించాలని పోలీసులను పంజాబ్ (పాకిస్తాన్) సీఎం ఉస్మాన్ బుజ్దార్ ఆదేశించారు.
Also Read: Whatsapp Message Tricks: నంబర్ సేవ్ చేయకుండానే వాట్సప్ మెసేజ్ చేయోచ్చు.. ఎలానో తెలుసా?
ALso Read: Viral Video: ప్రపంచం మంటలో కలిసిన సరే.. మాకు భోజనమే ముఖ్యం! నెటిజన్లు సీరియస్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook