Omicron In Australia: ఆస్ట్రేలియాలో ఒమిక్రాన్ వేరియంట్.. ఇద్దరు ప్రయాణికులకు పాజిటివ్

Omicron In Australia: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ (Omicron Variant) వైరస్ కేసులు.. ఇప్పుడు ఆస్ట్రేలియా వరకు చేరాయి. సౌతాఫ్రికా నుంచి సిడ్నీ చేరుకున్న ఇద్దరికి ఒమిక్రాన్ వైరస్ సోకినట్లు కొవిడ్ పరీక్షల్లో తేలింది. దీంతో ఆస్ట్రేలియా ఆరోగ్య అధికారులు అప్రమత్తమయ్యారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 28, 2021, 04:10 PM IST
    • ఆస్ట్రేలియాలో కరోనా కొత్త వేరియంట్ కలకలం
    • సౌతాఫ్రికా నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులకు పాజిటివ్
    • అప్రమత్తమైన ఆస్ట్రేలియా ఆరోగ్య అధికారులు
Omicron In Australia: ఆస్ట్రేలియాలో ఒమిక్రాన్ వేరియంట్.. ఇద్దరు ప్రయాణికులకు పాజిటివ్

Omicron In Australia: కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ (Omicron Variant).. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. సౌతాఫ్రికాలో ప్రారంభమైన ఈ కొత్త వేరియంట్ ఆ తర్వాత అనేక దేశాలకు విస్తరించింది. దీంతో అప్రమత్తమైన అనేక దేశాలు అంతర్జాతీయ ప్రయాణికులపై ఆంక్షలు (International Travel Restrictions) విధించాయి.  ఒమిక్రాన్‌ కేసులు వెలుగుచూసిన దేశాల నుంచి వస్తున్నవారికి పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ఇదే క్రమంలో తాజాగా ఆస్ట్రేలియాలోనూ ఈ వేరియంట్‌కు సంబంధించిన రెండు కేసులు బయటపడటం ఆ దేశ అధికారులను కలవరానికి గురిచేసింది.

సౌతాఫ్రికా నుంచి దోహా మీదుగా సిడ్నీ చేరుకున్న ప్రయాణికులకు కొవిడ్ టెస్ట్ నిర్వహించగా.. అందులో ఇద్దరికి కరోనా వైరస్ సోకినట్లు తేలింది. వెంటనే వారి నమూనాలను ల్యాబ్ కు పంపగా.. అది ఒమిక్రాన్ గా నిర్ధారణ అయ్యింది. వెంటనే వారిని ఐసోలేషన్ కు తరలించారు. అయితే ఒమిక్రాన్ సోకిన వారిద్దరిలో ఎలాంటి లక్షణాలు, రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ వారు తీసుకున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.

సౌతాఫ్రికా నుంచి మొత్తం 14 మంది సిడ్నీ చేరుకోగా.. అందులో 12 మందికి కరోనా పరీక్షల్లో నెగెటివ్ గా తేలింది. మిగిలిన ఇద్దరికి ఒమిక్రాన్ వేరియంట్ (Sydney Omicron Cases) సోకినట్లు తేలింది. అయినా ముందు జాగ్రత్తతో వారందరినీ క్వారంటైన్ కు తరలించినట్లు ఆస్ట్రేలియా ఆరోగ్య అధికారులు తెలిపారు.   

Also Read: South Africa Corona Variant: సౌతాఫ్రికా నుంచి వచ్చిన విమానంలో 60కి పైగా కరోనా కేసులు

Also Read: Newzealand MP: డెలివరీ కోసం స్వయంగా సైకిల్ తొక్కుతూ ఆసుపత్రికి వెళ్లిన మహిళా ఎంపీ  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News