Illegal Immigration: కొత్త రకం అక్రమ వలసలు, 60 విమానాల దారి మళ్లింపు

Illegal Immigration: ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్ని పట్టిపీడిస్తున్న సమస్య అక్రమ వలసలు. అక్రమ వలసల్ని నివారించేందుకు వివిధ దేశాలు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఏదో రూపంలో వచ్చేస్తున్నారు. ఇప్పుడు మరోరకం అక్రమ వలస వచ్చిపడింది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 7, 2021, 09:52 AM IST
 Illegal Immigration: కొత్త రకం అక్రమ వలసలు, 60 విమానాల దారి మళ్లింపు

Illegal Immigration: ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్ని పట్టిపీడిస్తున్న సమస్య అక్రమ వలసలు. అక్రమ వలసల్ని నివారించేందుకు వివిధ దేశాలు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఏదో రూపంలో వచ్చేస్తున్నారు. ఇప్పుడు మరోరకం అక్రమ వలస వచ్చిపడింది.

జీవన ఉపాధికి, మెరుగైన జీవితం కోసం ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి లేదా ఓ దేశం నుంచి మరో దేశానికి వలస సహజమే. అయితే ఈ క్రమంలో చాలామంది అక్రమ మార్గాల్ని అనుసరిస్తుంటారు. చాలా దేశాలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదే. అక్రమ వలసల్ని(Illegal Migration) నియంత్రించేందుకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఏదో రూపంలో అక్రమ వలసలు పెరుగుతున్నాయి. ఇప్పుడు కొత్త మరో రకం అక్రమ వలస వచ్చి చేరింది. స్పెయిన్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన రెండు దేశాల మధ్య విమర్శలకు దారి తీసింది. 

మొరాకోలోని కాసాబ్లాంకా నుంటి టర్కీలోని ఇస్కాంబుల్‌కు ఎయిర్‌ అరేబియా (Air Arabia)విమానం బయలుదేరింది. ఇందులో చాలామంది మొరాకో(Morocco) దేశస్తులున్నారు. మార్గమధ్యంలో ఓ ప్రయాణికుడు తనకు అనారోగ్యమంటూ విలవిల్లాడాడు. దీంతో విమానాన్ని స్పెయిన్‌ దేశానికి చెందిన పాల్మా డి మాలోర్కా దీవిలో ఉన్న ఎయిర్‌పోర్టుకు మళ్లించారు. ఇది స్పెయిన్‌లో(Spain) బిజీగా ఉండే ఎయిర్‌పోర్టు. ఇక్కడి నుంచి నిత్యం వందలాది విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయి. బాధిత ప్రయాణికుడికి చికిత్స అందించేందుకు మెడికల్‌ ఎమర్జెన్సీ నిమిత్తం ఎయిర్‌ అరేబియా ఫ్లైట్‌ను మాలోర్కా ఎయిర్‌పోర్టులో దించారు. అతడిని ఆసుపత్రికి తరలించారు. బాధితుడి వెంట ఓ సహాయకుడు ఉన్నాడు. విమానం ఆగడంతో ఇదే అదనుగా భావించి దాదాపు 22 మంది కిందికి దిగి, పరుగులు ప్రారంభించారు. కొందరు ఎయిర్‌పోర్టు కంచెను దాటుకొని బయటకు పారిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు అప్రమత్తమయ్యారు.12 మందిని పట్టుకున్నారు. మిగిలిన వారికోసం గాలిస్తున్నారు. ఈ గందరగోళం కారణంగా విమానాశ్రయాన్ని శుక్రవారం 4 గంటలపాటు మూసివేయాల్సి వచ్చింది. దాదాపు 60 విమానాలను దారి మళ్లించారు. 

అసలు విషయమేమంటే..సదరు ప్రయాణికుడు అనారోగ్యం అంటూ విమానంలో నాటకం ఆడినట్లు తేలింది. అతడికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని వైద్యులు గుర్తించారు. ప్రయాణికుడి వెంట వచ్చిన సహాయకుడు సైతం పరారయ్యాడు. ఇలాంటి సంఘటన తమ ఎయిర్‌పోర్టులో ఎప్పుడూ జరగలేదని అధికారులు చెప్పారు.స్పెయిన్‌లోకి అక్రమంగా ప్రవేశించడానికే మొరాకో(Morocco) దేశస్తులు ఈ కుట్ర పన్నినట్లు గుర్తించారు.

Also read Google Additional Security: ఇకపై గూగుల్ అదనపు ధృవీకరణ తప్పనిసరి లేకపోతే నో లాగిన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News