MP Watching Adult Videos: పార్లమెంట్ లో అశ్లీల చిత్రాలు చూస్తూ పట్టుబడిన ఎంపీ..!

MP Watching Adult Videos: పార్లమెంట్‌లో కూర్చున్న ఓ ఎంపీ తన మొబైల్‌లో అశ్లీల చిత్రాలను చూస్తూ కెమెరాకు చిక్కాడు. అతడిపై తగిన చర్యలు తీసుకోవాలని మహిళా ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని వారు ఫిర్యాదు చేశారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 28, 2022, 12:33 PM IST
MP Watching Adult Videos: పార్లమెంట్ లో అశ్లీల చిత్రాలు చూస్తూ పట్టుబడిన ఎంపీ..!

MP Watching Adult Videos: ప్రజాస్వామ్యంలో చట్టసభలైన పార్లమెంట్, శాసనసభలను దేవాలయాలుగా భావిస్తారు. అలాంటి చట్టసభల్లో రాజకీయ నాయకులు గొడవలు, కొట్లాటలు చేసుకుంటూ తరచూ తెరపైకి వస్తున్నారు. ఇప్పుడు తాజాగా బ్రిటిష్ పార్లమెంట్ లో ఓ అవమానకరమైన కేసు వెలుగులోకి వచ్చింది. పార్లమెంట్ లో ఓ సభ్యుడు అశ్లీల చిత్రాలు చూస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే ఇది కొత్తేమి కాదు. గతంలో అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లోనూ ఇవే ఘటనలు జరిగాయి. 

మహిళా పార్లమెంట్ సభ్యులు ఆగ్రహం..

'డైలీ మెయిల్'లో ప్రచురితమైన కథనం ప్రకారం.. బ్రిటన్ పార్లమెంట్‌లో ఓ ఎంపీ తన మొబైల్‌లో అడల్ట్ సినిమా చూస్తున్నారు. దీంతో అక్కడున్న మహిళా ఎంపీలు ఆ వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నివేదిక ప్రకారం.. దీనిపై ఓ మహిళ ఎంపీ కూడా ఫిర్యాదు చేశారు. మిగిలిన ఎంపీలు కూడా ఈ విషయంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. 

నిందితుడి పేరు బయటకు రాకుండా..

ఇదే విషయంపై పలువురు మహిళా ఎంపీలు గళాన్ని వినిపించారు. దీనిపై సంబంధిత అధికారులు విచారణ చేపట్టారు. అయితే అలాంటి పని చేసిన ఎంపీ ఎవరనే విషయం మాత్రం బయటకు రాలేదు. అశ్లీల చిత్రాలను చూసిన వ్యక్తి పేరు బయటకు పొక్కకుండా చూసుకుంటున్నారు. దీనిపై విచారణ చేపడుతున్న అధికారులు.. తప్పు చేసిన వారికి శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.  

Also Read: Karachi University blast suicide bomber: కరాచీ సూసైడ్ బాంబర్‌ గురించి సంచలన విషయాలు

Also Read: Aung san suu kyi: ఆంగ్ సాన్‌ సూకీకి జైలు శిక్ష..ఎందుకు..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News