Study on Monkeypox Cases: ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న మంకీపాక్స్ వ్యాధికి సంబంధించి ఇంగ్లాండ్ పరిశోధకుల అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. మంకీపాక్స్ వ్యాధి సోకిన వ్యక్తుల్లో 98 శాతం మంది గే లేదా బైసెక్సువల్ పురుషులేనని వెల్లడైంది. పురుషులతో పురుషులకు లైంగిక సంబంధాలే మంకీపాక్స్ వ్యాధి వ్యాప్తికి కారణమై ఉండొచ్చునని పేర్కొంది. 16 దేశాల్లో 528 మంకీపాక్స్ కేసులను విశ్లేషించిన పరిశోధకులు ఈ అంచనాకు వచ్చారు. దీనిపై జూలై 21న '16 దేశాల్లో మంకీపాక్స్ వైరస్ ఇన్ఫెక్షన్-ఏప్రిల్-జూన్ 2022' పేరిట ఇంగ్లాండ్‌లో ఒక జర్నల్ ప్రచురితమైంది.
'ఈ ఏడాది ఏప్రిల్ 27, జూన్ 24 మధ్య 16 దేశాల్లోని 43 ప్రాంతాల్లో నమోదైన 528 మంకీపాక్స్ ఇన్ఫెక్షన్ కేసులను మేము పరిశీలించాం. ఇందులో 98 శాతం వ్యక్తులు గే లేదా బైసెక్సువల్ పురుషులు. వీరిలో 75 శాతం మంది తెల్లవారు ఉన్నారు. 41 శాతం మంది హెచ్ఐవితో బాధపడుతున్నారు. వీరి సగటు వయసు 38 సంవత్సరాలు.' అని తాజా జర్నల్‌లో పరిశోధకులు పేర్కొన్నారు. లైంగిక చర్య ద్వారానే వ్యాధి వ్యాప్తి జరుగుతోందనే అనుమానం కలుగుతోందన్నారు.
క్వీన్ మేరీ యూనివర్సిటీ ఆఫ్ లండన్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అండ్ ఇమ్యూనిటీ, ఎన్‌హెచ్ఎస్ ట్రస్ట్, హోమర్టన్ యూనివర్సిటీ హాస్పిటల్, క్లినికల్ ఇన్ఫెక్షన్ యూనిట్, సెయింట్ జార్జ్ యూనివర్సిటీ హాస్పిటల్, మెక్‌గిల్ యూనివర్సిటీ హెల్త్ కేర్ సెంటర్ తదితరులు ఈ పరిశోధనలో పాలు పంచుకున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ 60 దేశాల్లో 14 వేల పైచిలుకు మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధి కారణంగా ఐదుగురు చనిపోయారు. అమెరికాలో తొలిసారిగా చిన్నారుల్లోనూ మంకీపాక్స్ బయటపడటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. అమెరికాలో నమోదైన కేసుల్లోనూ 99 శాతం కేసుల్లో గే లేదా బైసెక్సువల్ వ్యక్తులే ఉన్నట్లు నిర్ధారించారు. ఇక ఇండియాలో ఇప్పటివరకూ 3 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. ఈ 3 కేసులు కేరళలోనే నమోదవడం గమనార్హం. మంకీపాక్స్ వ్యాప్తి నేపథ్యంలో విమానాశ్రయాల్లో విస్తృతంగా స్క్రీనింగ్ చేపడుతున్నారు. అయితే మంకీపాక్స్ పట్ల ఆందోళన చెందవద్దని.. కోవిడ్ స్థాయిలో అది విజృంభించే అవకాశం లేదని అంటున్నారు.
Also Read: Srisailam Dam:జూలైలోనే నిండిన శ్రీశైలం డ్యాం.. ఇవాళ గేట్లు ఓపెన్.. పర్యాటకుల సందడి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook