Mexico accident: కార్లపైకి దూసుకెళ్లిన ట్రక్కు... 19 మంది దుర్మరణం!

Mexico accident: ఆగి ఉన్న కార్లపైకి ఓ ట్రక్కు దూసుకెళ్లిన ఘటనలో 19 మంది మృతి చెందారు. ఈ ప్రమాదం మెక్సికోలో చోటుచేసుకుంది.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 7, 2021, 03:00 PM IST
Mexico accident: కార్లపైకి దూసుకెళ్లిన ట్రక్కు... 19 మంది దుర్మరణం!

Mexico City: మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం(Mexico Road Accident) సంభవించింది. ఈ ఘటనలో 19 మంది మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. సెంట్రల్ మెక్సికో(central Mexico) లోని రహదారిపై టోల్‌బూత్ (toll booth) వద్ద ఆపిన వాహనాలపైకి.. ఓ రవాణా ట్రక్కు(Trasport Truck) దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో మంటలు చెలరేగడంతో తొమ్మిది వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటల్లో చిక్కుకుని 19 మంది సజీవ దహనమయ్యారు. ట్రక్కు బ్రేకులు విఫలం కావడం వల్లే ఈ ప్రమాదం సంభవించినట్లు అధికారులు తెలిపారు.

Also Read:Houston Music Festival: అమెరికాలో ఘోర విషాదం.. మ్యూజికల్ ఈవెంట్‌లో తొక్కిసలాట... 8 మంది మృతి

గ్లూ(glue)ను తరలిస్తున్న ఓ ట్రక్కు.. టోల్​బూత్​​(Toll Booth Accident) వద్ద బ్రేకులు ఫెయిల్​ అవ్వగా ఈ ప్రమాదం జరిగిందని మెక్సికో అగ్నిమాపక శాఖ అధికారి ఆర్డియన్​ డియాజ్​ చావెజ్​ తెలిపారు. మెక్సికోలోని చాల్కో ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని పేర్కొన్నారు. మరోవైపు.. ఈ ప్రమాదానికి(Mexico Accident) సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అందులో వాహనాలకు పెద్దఎత్తున మంటలు వ్యాపించినట్లుగా కనిపించాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News